Tabs



Nov 14, 2014

ఆ కుంచె గీతలు..చెరగనివి..


బాపు గారి "రాంబంటు" చూస్తుంటే ఎందుకో గుండె తడి కంటికంటింది..ఒక్కో ఫ్రేం అతని "కుంచె"ని గుర్తుచేస్తూనే ఉంది..చివర్లో..నీతికి నిలబడేవాడే దేవుడని,రాముడని అంటాడు..రాంబంటు రాముడౌతాడు..ఆ కుంచె గీతలు-ఆ రాతలు తెలుగువారి గుండె నుండి ఎప్పటికీ చెరగనివి, చెరపలేనివి అని అర్థమౌతుంది.ఆ కుంచెకి చావులేదు..చిరంజీవి.

Nov 4, 2014

బహిరంగ చుంబనం..నేటి యువత..


చుంబనం ఇద్దరి వ్యక్తుల అంగీకారం, ఇష్టానికి సంబంధించినదనీ..అది బహిరంగమైనా పరవాలేదని నేటి యువత అభిప్రాయపడుతుంది.ఉదాహరణకి వారు ఇస్తున్నది దేవాలయాల మీద ఉన్న బొమ్మలు..మరి పరస్త్రీ తల్లితో సమానం అని ఇదే కర్మ భూమి చెప్పింది..అది కనిపించలేదా?ఎక్కడికి వెళ్తున్నాం? అన్నమయ్య సినిమాలో నాగార్జున సుమన్ తో (అన్నమయ్య, దేవుడితో) ఆ దేవాలయంపైన నీకు ఎమి కనిపిస్తుంది అన్నమాటకి, దేవుడు- సృస్టికర్తలైన అమ్మ-నాన్నలని చూసినట్లుంది అంటాడు.. చూసే-దృష్టి విఙానం మనిషికి చాలా అవసరం. ఒక శాస్త్ర విఙానం మనిషికి అందించడానికి ఆరోజుల్లో అది ఒకమాధ్యమం అయ్యివుండవచ్చు. అంతమాత్రం చేత బహిరంగంగ ఆచరించమని చెప్పలేదు. మనిషి విశృంఖలత తగ్గించడానికి సమాజం అనేది ఒకటి తయారుచేసుకొని దానికి కొన్ని పద్ధతులు పెట్టాక, ఒక్కో ప్రదేశంలో ఉన్నవారు ఆ ప్రదేశ పద్దతులకి అలవాటుపడ్డారు.వాటిని గౌరవించుకోవటం అవసరం. ఈ విషయం అర్థం చేసుకోమంటే యువతకి ఎందుకుకోపం వస్తుందో నాకర్థంకావటంలేదు.వీరికి విఙానం చాలా అవసరం.ఙానము సముపార్జించలేని చదువు సెంట్రల్ యూనివెర్సిటి అయితే ఏంటి..ఇంకోటి అయితే ఏంటి..

Nov 1, 2014

నలభీమ పాకం..వంట ఒక కళ..


నలభీమ పాకం అని వంటలో రిఫెరెన్స్ మగవాళ్ళనే (నలుడు, భీముడు) చెప్తారేంటా, అని చాలాసార్లు ఆలోచించా..ఇంకా చాలా హోటెల్స్ లో మగవాళ్ళే వంటవాళ్ళలా ఎందుకుంటారా అని ఆలొచించా..అప్పుడు అనుకున్నాను: బలం ఎక్కువ వుండడం వల్లనేమో, లేదా ఎక్కువసేపు అలసటలేకుండా పనిచెయ్యగలరుకదా అని. కాని ఇప్పుడనిపిస్తుంది..వీళ్ళు వంటను కళగా చూసి, అందులో ఎంజాయ్ చెయ్యడం వలనే అంతపేరు వచ్చిందా అని. మీరు గమనిస్తే వంట మాస్టర్స్ గాలిలో పూరీలు విసరడం, రుమాలి రోటి చేసేపద్దతి,కూరగాయలు తరిగే పద్ధతి, అన్నీ కళాత్మకంగా ఉంటుంది.అందుకే చేసే పని ఎంజాయ్చెయ్యండి..కళాత్మకంగా చెయ్యండి..

Oct 28, 2014

ప్రజలు-వర్గాలు-ప్రభుత్వాలు..


నేటి రాజకీయ పార్టీలు, ప్రభుత్వాల తీరుని బట్టి నాకెందుకో ప్రజలని 3 రకాలుగ విభజించాలనిపించింది. 1.నిరాశావాదులు 2.ఆశావాదులు 3.అత్యాశావాదులు

నిరాశావాదులు : ఏ ప్రభుత్వం వచ్చినా మనకేమి చేస్తారులే, ఎవరు వచ్చినా ఒకటే. వీళ్ళ దృష్టిలో అందరూ ఒకేలా కనిపిస్తారు.కాబట్టి వీళ్ళు ఎవరికి సపోర్ట్ చెయ్యరు. మార్పు వీళ్ళవల్ల సాధ్యపడదు.

ఆశావాదులు: వీళ్ళు, కొంచెం మంచిచేసినా వీడు వస్తే బాగుండు అనుకుంటారు. ప్రతీఒక్కడిలోని ఎప్పుడో ఒకప్పుడు మంచి చూడగలరు. ఎన్నిసార్లు ఎంతమంది ఏమి చెప్పినా నమ్ముతారు. చెయ్యకపోతే తిడతారు, కాని మళ్ళీ నమ్ముతారు.మార్పు వీళ్ళవల్లే సాధ్యపడుతుంది.వీడేమి చేస్తాడో చూద్దాం అన్నట్లుంటుంది వీళ్ళ ధోరణి.

అత్యాశావాదులు: వీళ్ళు అందరూ సన్నాసులే అంటారు. అందరూ దొంగలే అంటారు. అందరిలోనూ ఎదోఒక మచ్చ చూస్తూనే ఉంటారు. ఒక పెద్ద తెల్లకాగితంలో చిన్న మచ్చని కూడా వదలరు. అంత అయిడియల్ గా ఉండాలి అంటారు. ఇలాంటివారు ఎవరూ ఉండరాయె. కాబట్టి వీళ్ళు ఎవరికి సపోర్ట్ చెయ్యరు. మార్పు వీళ్ళవల్ల సాధ్యపడదు.

వీళ్ళందరూ కాక ఇంకొక వర్గం ఉంది. అదే అవకాశవాదులు..వీళ్ళని గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఇప్పుడు ఊహించుకొండి మీరు ఏ వర్గం లోకి వస్తారో..

Oct 18, 2014

విశాఖలో ఒక పాజెటివ్ వేవ్..ఇలాగే ముందుకి వెళ్దాం..


విశాఖలో ఇప్పుడు ఒక పాజెటివ్ వేవ్ అనండి లేదా ఒక పాజెటివ్ శక్తి అనండి ప్రవహిస్తుందనిపిస్తుంది.రాష్ట్రం నలుమూలల నుండి అది వీస్తుంది.అందరినీ ఉత్తేజపరుస్తుంది. ఈ వేవ్ కనక ఇలాగే వీస్తే చాలా కొద్ది సమయంలో తిరిగి రెట్టించిన ఉత్సాహంతో రాష్త్రం అభివృద్ధి పథంలో నడుస్తుంది అనటంలో సందేహంలేదు. ఇప్పటికీ నెగటివిటి వెనక్కిలాగడానికి ప్రయత్నిస్తుంది కాని మనం లొంగకూడదు. అందరూ చెట్లు నాటటంలో కూడా భాగస్వామ్యం కావాలి. ఇకపోతే ఈ చెట్లు నాటటంలో అగ్రికల్చర్ విద్యార్థులని సూపర్వైజర్లుగా వాడుకుంటామని సీ.ఎం గారు ప్రకటించారు.ఇంకా అరకు, పాడేరు లో 5లక్షల ఎకరాలలో కాఫి పండించవచ్చు అని గుర్తించారు.నిజంగా అందుబాటులోనున్న సంపద ఏదైన సమర్ధవంతంగా వాడుకోవటం ఈయనకి వెన్నతోపెట్టిన విద్య అని వేరే చెప్పనక్కరలేదు.విశాఖలో వ్యవస్థలని వీలైనంతవరకు "అండర్ గ్రౌండ్" చేస్తామని ప్రకటించారు(మళ్ళీ ఇంకో తుఫాన్ కి దొరకకుండా). ఈ దీపావళికి విశాఖలో బాణాసంచా వద్దు, దీపాలతో అలంకరించుకోండి అని చెప్పి బాధ్యతని గుర్తుచేశారు (ఇప్పుడున్న పరిస్థితులలో ఫైర్ ఇంజిన్ సప్లయ్ కష్టం). వచ్చే దీపావళిని ఇంకా ఆనందంగా జరుపుకుందామని చెప్పి జనాలలో ఆశాభావాన్ని రేకెత్తించారు. మారుతి రావు గారు నిన్న చెప్పినట్టు నిరాశని మాత్రం దగ్గరకి రానివ్వటంలేదు.ఇది చాలు..ఇలాగే ముందుకి వెళ్ళాలని ఆశిద్దాం..ఫినిక్ష్ అనే పక్షి మంటలలో తనని తానే కాల్చుకొని మళ్ళీ ఆ బూడిద నుండే అందంగా పుడుతుందట..అలాగే విశాఖ కూడా మరింత అందంగా వికశిస్తుందని ఆశిస్తున్నా..

Oct 14, 2014

ఎ.పి సి.ఎం సహాయనిధి: AP CM relief fund


పెద్దమనసున్నొళ్ళు పెద్ద పెద్ద విరాళాలు పంపారు..ఉడతాభక్తిగా మనమూ పంపిద్దాం: AP CM Relief Fund, SBI account-33913634404, IFSC Code-SBIN0002724, Branch Name, SBI Treasury Branch, Gowliguda, Hyderabad

హుద్ హుద్: కొంచెం సమ్యమనం పాటించండి.


ఒక బస్తీకి 5 పెద్దలారీల నిత్యావసరాలు వరదబాధితుల సహయార్థం వస్తే జనాలు ఎప్పటిలాగే ఎగబడి తీసుకుంటున్నారు..ఎవరికి ఎన్ని వెల్తున్నాయి, ఒకరే 2/3 తీసుకున్నా తెలియని పరిస్థితి.పోలీసులున్నారు, తక్కువమంది..ఎక్కువమంది మిగతా సహాయకచర్యల్లొ ఉన్నారు.వీళ్ళు మాత్రం ఏమి చెయ్యగలరు, లాఠి చార్జి చెయ్యలేరు కదా.ఇది జనాలలో ఉండాలి. ఇది ఇలా ఉంటే మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి వాళ్ళు గుంపులో ఎగబడడానికి అభిమానం అడ్డొస్తుంది. వాళ్ళు ఈ సాయాన్ని తీసుకోరు. వాళ్ళకి కరెంటు, తాగునీరు, పాలు డబ్బులకి దొరికితే చాలు అనుకుంటారు. ఇవి అయినా వెంటనే ఎలావస్తాయి..మొత్తం 3 జిల్లాలు ఊడ్చిపెట్టుకుపోయాయి కరెంటు స్థంభాలు, అన్నింటిని సరిచేసి చెక్ చేసుకోవటనికి చాలా టైం పడుతుంది.పాలు కలెక్షన్ కి వెళ్ళాలంటే పల్లెలకి రోడ్లు, వాహనాలకి డీసిల్ ఉండాలి. రెండు లేవు.మరి పాలు ఎలావస్తాయి.తాగునీటికి జెనరేటర్లు వినియోగిస్తున్నారు. ఒకేసారి సిటీ మొత్తానికి ఇవ్వాలి.కొంచెం సమ్యమనం పాటిస్తూ మనకి వీలయిన ప్రత్యామ్నాయాలు మనం చూసుకోవటం మంచిది.వీలైతే వేరే ఊళ్ళో మీ బంధువుల ఇంతికి వెల్లటం మంచిదేమో.

Oct 13, 2014

"హుద్ హుద్" ప్రకృతివిలయం..శభాష్ చంద్రబాబు..


మూలిగే నక్కపైన తాటిపండుపడ్డట్టు..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి "హుద్ హుద్" అపారనష్టాన్ని మిగిల్చింది. పాపం ఎన్నో కుటుంబాలు రోడ్డునపడితే నేను సామెతతో మొదలుపెట్టిపోల్చడం నాకే కొంచెం చిరాగ్గ అనిపిస్తుంది. ఏది ఏమైనా ప్రభుత్వం/చంద్రబాబు, అధికార్ల అప్రమత్తత వల్ల ఎన్నో ప్రాణాలను రక్షించగలిగారు. ఈ భీభత్స పరిస్థితులు నాకు తెలిసి ఎప్పుడూ చూడలేదు. అప్రమత్తత అంటే ఎలా ఉండాలి అన్నవిషయం లో రాబొయే ప్రభుత్వాలకి బెంచ్ మార్క్ ఇచ్చాడు అనటంలో అతిశయొక్తి కాదు. చాలామంది నాకుతెలిసి ఇది "మామూలు" తూఫానె అనుకున్నారు, రాకముందు..అందుకే ప్రభుత్వ ప్రకటనని కూడా లెక్క చెయ్యకుండా ప్రయాణాలకి వెళ్ళి ఇరుక్కున్నారు. అందులో కొంతమంది ప్రభుత్వాన్ని నిందించటం కూడా మొదలెట్టారు మైక్ దొరికేసరికి.బయటిప్రపంచంతో సంబంధాలు తెగిన కొంతమంది కూడా నిందించటం మొదలెట్టారు..ఎందుకంటే వాళ్ళకి తమ ఊరుకాక మిగతా ఊళ్ళు, పట్టణాలు ఎంత దెబ్బతిన్నయో తెలిదు కాబట్టి..ఇలాంటి పరిస్తితులలో ఒక బాధ్యతగల వ్యక్తిగా సి.ఎం. అన్ని కార్యకలాపాలు అక్కడినుండే జరపమనడం అక్కడి ప్రజలకి ఎంతో ధైర్యం ఇచ్చేవిషయం. అన్ని పొరుగు రాష్ట్రాలని సంప్రదించి, ప్రధానితో కూడా మాట్లాడి అదనపు సహాయం పొందటం దగ్గరనుండి..టెక్నాలజి ని అందినంతవరకు వినియోగించుకోవటం..ముందస్తు జాగ్రత్తలతో యంత్రాంగాన్ని అప్రమత్తం చేయటం వరకు..ఇంకా వాళ్ళతో కలిసి పనిచేస్తూ వీలైనంత త్వరలో అన్ని విభాగాలని రెజ్యూం చేయటం చూస్తుంటే..ఇంకో ప్రభుత్వం ఉంటే ఇలా చెయ్యగలదా అని అనిపిస్తుంది! ఇంకా..ఎంతో దీక్షగా అక్కడ సేవలని వినియోగిస్తున్న వారందరికి ధన్యవాదములు! ఇలాంటి సమయాల్లో ఎప్పుడు రాజకీయం చేద్దామా అని చూసే వాళ్ళకి (అదే..ప్రతిపక్షం) నేనొక్కటే చెప్పేది..వీలైతే సహాయం చెయ్యండి, అంతే కాని ఇప్పుడు రాజకీయం చెయ్యాలని చూస్తే కనీసం ఇంకో రెండుతరాలకి మీరు దూరమౌతారు..

Oct 1, 2014

గోవిందుడు అందరివాడేలే..


దసరా పండగ రెండు రోజులముందే తెచ్చాడు కృష్ణవంశి.నిండుగా కుటుంబం అంతా కలిసి చూడొచ్చు సినిమా..అదేనండి "గోవిందుడు అందరివాడేలే". కృష్ణవంశి మార్కు సినిమా. .ఒకట్రెండు దగ్గర మన "మురారి" కనపడ్డాడు "రాం" లో..రాం నటుడిగా ఇంకా కొంత ఇంప్రూవ్ అవ్వాలి.కష్టపడ్డాడు అనుకోండి.. ఎమోషన్ ప్రేక్షకులలో ఇంకా రిజిస్టెర్ అయితే బాగుండు అనిపించింది.మొత్తానికి ఒక "అబోవ్ ఆవెరేజ్"..అదె అదె హిట్టేలెండి...

Sep 29, 2014

గూగుల్-తెలుగు భాష-డిమాండ్?


తెలుగు 'ఫాంట్' ను డిజిటలైజ్ చేయడమే లక్ష్యం అంటూ ఆంద్రప్రదేశ్ లో ప్రకటన చేసిన గూగుల్ నిజంగ తెలుగు 'ఫాంట్' కి అంత డిమాండ్ ఉందని అనుకుంటుందా? ఎదో కొద్దిమంది తప్ప తెలుగుని మర్చిపోయే రోజులొచ్చాయేమొ అని నాకు అనిపిస్తుంది. రాష్త్ర ప్రభుత్వం తెలుగు ప్రాముఖ్యత విద్యావిధానం లో పెంచితే ముందు తరాలలో ఈ భాష చచ్చిపోకుండా మనగలుగుతుంది.ముందు ఆ దిశలో అడుగు వెయ్యాలి. ఇంకా, మంచి సంస్థలు ముందుకొచ్చి తెలుగు భాషలోని అద్భుత కావ్య మాధుర్యాన్ని డిజిటలైజ్ చెయ్యాలి. అప్పుడు, అందులో ఆశక్తి వున్నవాళ్ళతోనైన డిజిటల్మీడియ అభివృద్ధి చెంది మళ్ళీ మనకి ఉద్యోగాలు క్రియేట్ చేస్తుంది. భూమి గుండ్రం ఉంటుంది కదా? అలాగే మన భాషా సంపద చచ్చిపోదు కూడా!

Sep 21, 2014

ఉత్తరాంధ్రకి ఎప్పుడూ మొండి చెయ్యేనా?


ఒక నాయుడు గారు విశాఖ ని "మెగాసిటి" చేస్తానంటే, ఒక నాయుడుగారు (కేంద్రం నుండి) విశాఖ స్మార్ట్ సిటియే అంటున్నారు. అదికాక ఇంటెర్నేషనల్ ఎయిర్పోర్ట్ అన్నారు ఇప్పుడు నేవి వాళ్ళు ఒప్పుకోవట్లేదంటున్నారు. మరి శ్రీకాకుళాన్ని ఫార్మా కంపు, కాలుష్యం తో నింపేస్తున్నారు, విశాఖ లో బొగ్గు కాలుష్యం ఉండనే ఉంది. బాబూ.. మా ఉత్తరాంధ్రలో మీకు కనపడనివి ఇంకా చాలానే ఉన్నాయి. పెద్దగా పంటలు పండని నేలలు, ఊరికే వరదలతొ మునిగిపోయే పంటలు, అడవులు, కష్టపడి పని చేసి ఫలితం పెద్దగా ఆశించని మనుషులు, ఏ ప్రభుత్వం ఉన్నా మనకేమి లాభంలే అనుకునే నిరాశా జీవులు-చదువుకున్న అఙానులు, అభద్రతాభావ విద్యార్థులు, ఎన్నెన్నో వలసలు..ఇంకెన్నో నాకుతెలియని కష్టాలు..ఇంకా అందమయిన విశాఖ నగరం,సహజంగా ఏర్పడ్డ పోర్టు, ఉక్కునగరమని పేరు, సిమ్హాద్రి అప్పన్న సామి, చదువుకున్నా ఉద్యోగావకాశాలు లేక దేశ విదేశాలు పోయి "వలసబతుకు" బతుకుతున్న నిపుణులు..అందరూ ఎవరో వస్తారని ఏదో చేస్తారని బలంగా నమ్ముతున్నవారే, ఎప్పుడూ వెనకబాటు.. వెనకబాటు అని ఊదరగొట్టడమేకాని మాకు ఏ ప్రభుత్వం వచ్చినా ఒరిగింది ఏమీలేదు. నాయకుల జేబులు నిండుతున్నాయి తప్ప..మా ప్రాంత నాయకులకి ఇప్పటికైనా చెప్పేది ఒకటే.. ఇప్పటికైన సిగ్గు తెచ్చుకోండి..ప్రజలకోసం అడగండి, మిగిలిన ఎంగిలి మెతుకులు ఏరుకొని బతకటం మనకి వద్దు..అలాగే ఇంకొకటి గుర్తుపెట్టుకోండి "ప్రత్యేకం/విభజన" నా ఆకంక్ష కాదు.. తెలుగు ప్రజలు ఇంకొక విభజనని కోరుకోవటం లేదు..అభివృద్ధి కోరుతున్నాం..అంతే.

Sep 18, 2014

"గోవిందుడు అందరివాడేలే"..పాటలు బాగున్నాయిరోయ్!


"గోవిందుడు అందరివాడేలే"..కృష్ణవంశి సినిమా కదా! పాటలు వినడానికి ధైర్యం చేశాను..మొదటి ప్రయత్నంలోనే 3 నచ్చాయి.నిజానికి మా స్నేహితుడు భరోశ ఇచ్చాడులెండి (ధన్యవాదములురా విష్ణు!). యువన్ బాగా చేశాడు.ఇకపోతే ఈ సినిమాలోనైనా చరణ్ మొహంలో ఎక్ష్ప్రెషన్ కనిపిస్తుందని ఆశిస్తున్నా. ట్రైలెర్ చూస్తుంటే "వంశి" బాగాకనిపిస్తున్నాడు. మగధీర తరువాత మళ్ళీ చరణ్ ఇది మంచిపేరు తెచ్చే సినిమా అయ్యే అవకాశాలున్నాయి. [ఎవడు సినిమా లో హీరో అల్లు అర్జున్ కదా..అంతే కాకుండా నటుడిగా చరణ్ పెద్దగా సాధించింది ఎమీలేదు ఆ సినిమాలో,అందుకే మగధీర తరువాత అన్నా.] ముందు అతను ఆర్టిస్ట్ గా నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది..తరువాతే హీరో..

Sep 17, 2014

మెట్రొ ముందుకా? వెనక్కా?


తెలంగాణా ప్రభుత్వం మాకుసహకరిస్తోంది. మెట్రోలో చిన్న చిన్న సమస్యలున్న మాట వాస్తవం. వాటికి పరిష్కరించుకుంటాం. పిబ్రవరి 2014 నుండి ప్రభుత్వానికి లేఖలు రాస్తున్నాం.ఒకవేళ సమస్యలు పరిష్కారం కాకుంటే ప్రాజెక్ట్ ప్రభుత్వపరం చేస్తాము-ఎల్.అండ్.టి ఎం.డి (గార్గిల్) దీనిభావమేమి తిరుమలేశా?

Sep 12, 2014

దేశం మొత్తం చూస్తుంది..తస్మాత్ జాగ్రత్త..


సభని అవమానించడం తప్పే..అందులోనూ పొలిటీషియన్స్ ని కామెడి చెయ్యటం ఈ మధ్య బాగనే అలవాటయిపోయింది.అయితే వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు, ఇంకా ముందుకుపోయి లైసెన్సులు క్యాన్సిల్ చెయ్యొచ్చు, కాని ఏది చేసిన రాజ్యాంగబద్ధంగ ఉండాలి. అలాగే క్షమాపణ కోరినపుడు, ఒక సీరియస్ వార్నింగు ఇచ్చి వదిలితే మిగతా చానెల్స్ కూడ జాగ్రత్తగా మంచి క్వాలిటి వార్తలు ప్రసారం చేస్తాయి.ఒకప్పుడు అతను ప్రాంతీయ ఉద్యమనేత, ఎప్పుడైన రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా అది ఉద్యమకారులకు ఉత్సాహాన్ని నింపేదేమొ. కాని ఇప్పుడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆయన ఏమి మాట్లాడినా దేశం మొత్తం చూస్తుంది. అతని నడక, నడత అన్ని గమనిస్తుంది. కొత్తగా అతను ఏమి అనలేదు..తన యాసలోనే సరదాగ జోక్ చేస్తూ.. "పదికిలోమీటర్లలోపల పాతరేస్తాం..", "తెలంగాణాలో ఉండదల్చుకుంటే సల్యూట్ కొట్టి ఉండాలి" అన్నమాటలు అన్న సందర్భం వేరు, అన్యాయం చేస్తే ఊరుకోము అనే సందర్భాన్ని భాష మారేసరికి వేరే అర్థాన్ని ఇస్తూ మొత్తం నేషనల్ జర్నలిస్టుల అహం దెబ్బతిని మరిగిపోతున్నారు.అలాగే అదే సభలో రాజయ్య ని అవమానించారని కొత్త వివాదం..కాబట్టి కొంచెం సభల్లో మాట్లాడేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవటం అవసరం..లేదంటే ఇప్పటికే ఎక్కడ దొరుకుతాదా అని ఆకలితో ఎదురుచూస్తున్న టి.వీ లకి దొరుకుతూనే ఉంటాడు.ఎలక్ట్రానిక్ మీడియ పుణ్యమా అని ఎమి మాట్లాడిన వెంటనే తర్జుమా చేసి మరీ వేసేస్తున్నారు.(i mean true translation) ఔనట్టు..true translation ప్రాబ్లెం మీకు తెలుసనుకుంటా..

Sep 6, 2014

పేరు వినాయకుడిది..మరి పండగ మందుబాబులకి..


వినాయకుని పేరు చెప్పుకొని తాగడం, విపరీతమైన సౌండ్ పొల్యూషన్ అవసరమా? వినాయకుడు తాగకపోతే రానంటడా? పక్కవీధిలో పెద్ద బొమ్మ పెట్టాడని మనవీధిలో అంతకన్నా పెద్ద బొమ్మ పెట్టాలనుకోవటం అహానికి నిదర్శనం కాదా? ఎక్కడనుండి ఎక్కడికి వెళ్తున్నాం మనం?

Sep 1, 2014

బాపు-రమణీయం..


తెలుగుభాషకి చమత్కార కారాన్ని అద్దినా, తీయనైన వ్యంగ్యాన్ని అద్దినా, ఎప్పుడైనా పులుపు, వగరు..వగైరాలు తగిలినా..బాపు-రమణీయం ఉగాది పచ్చడేసుమా! తెలుగువారికి నిత్య ఉగాది ఈ స్నేహద్వయం.భావుకత బాపు కథలలో ఉంటే ఆ గీతలనిండా సొగసే మరి..మరి బుడుగో? ఈయన చిచ్చరపిడుగు కాదుట చిచ్చులపిడుగుట..హ హ హ..! భూమి మీద ధనాన్ని.. అదేనండి తెలుగు"ధనాన్ని" ఎక్కువ పంచేశారంట..మరీ ఎక్కువైతే పున్యాత్ములైపోయి కలి ప్రబలడం కష్టమని దేవుడు తన చెంతకు పిలిచేశాడనుకుంటా..పోయినోళ్ళు అందరూ మంచోళ్ళే మరి..! మీలోటు పూడ్చలేనిదే!!

Jul 27, 2014

తెలంగాణేతరులని మైనారిటీలుగా గుర్తించమంటే గుర్తిస్తారా?


నాకు తెలిసి కరెంట్ బిల్లు కట్టలేదని డ్యు డేట్ దాటిన 7 రోజులకి కనెక్షన్ టెర్మినేషన్ ఎక్కడా చూడలేదు..as indicated in para-5 (1) (c ) of APERC Regulation No.7 (Consumer's Right to Information) ప్రకారం 7 రోజుల ముందు నోటీస్ ఇవ్వనిదే కనెక్షన్ టెర్మినేట్ చెయ్యకూడదు, మరి మా అపార్ట్మెంటులో (మరియు కాలని మొత్తం) ఎందుకు ఇలా జరిగింది? అధికారుల -----? లేక వేరే కారణలున్నాయా (ఇది తెలంగాణేతరులు ఎక్కువగా ఉన్న కాలని కాబట్టి)? ఇది అడ్డమేసుకొని తెలంగాణాలొ తెలంగాణేతరులని చిన్న చూపు చూస్తున్నారు, దౌర్జన్యం చేస్తున్నారు, తొక్కేయలని చూస్తున్నారంటే..హర్షిస్తారా? తెలంగాణేతరులని మైనారిటీలుగా గుర్తించమంటే గుర్తిస్తారా? ఎందుకంటే ఇది మన భారతం..ఇలాంటి చిన్న విషయాలకు కూడా రాద్ధాంతం చేసేరోజులొచ్చాయి..

Jul 23, 2014

ఇక్కడ 100000 కోట్లు అవినీతి చేసేవాడి కన్నా 10000 కోట్ల అవినీతి చేసేవాడు నీతిమంతుడు..


"నువ్వు స్కాం చేసావు అంటే..నువ్వు చెయ్యలేదా" అని అడిగే సంస్కృతి మనకి వద్దు..".ఇది భారత ప్రజాస్వామ్యం..ఇక్కడ 100000 కోట్లు అవినీతి చేసేవాడి కన్నా 10000 కోట్ల అవినీతి చేసేవాడు నీతిమంతుడు..

Jul 16, 2014


దృశ్యం..ఫ్యామిలి బాండింగ్, ఎమోషన్స్ మరియు థ్రిల్(హారొర్ కాదు) కలగలిపిన సినిమా.కథనం ఎక్కడా బోర్ కొట్టించలేదు. ఈ మద్యకాలం లో వచ్చిన సినిమాల్లొ నాకు నచ్చింది.తప్పకుండా చూడండి. నా రేటింగ్: 4/5

Jun 25, 2014

సుందరుడు అంటే ఆంజనేయుడట!


సుందరుడు అంటే ఆంజనేయుడట! అందుకే సుందరకాండ అని పేరు వచ్చిందట. ఆంజనేయుడు చిన్నతనంలో సుందరంగా ఉండేవాడని అంజనీదేవి సుందరుడని పిలిచేదట.కొత్తవిషయం నేర్చుకున్నాం కదూ..

Jun 9, 2014

గుండె కలవాడేను మనిషోయ్??


అన్యాయాన్ని అడగడానికి, లేదా ఎదిరించడానికి కండ కాదు గుండె కావాలని..మన భారతీయత ఎప్పుడో చెప్పింది..అందుకు చివరగా మిగిలిన ఒకే ఒక సాక్ష్యం గాంధి. ఇంకా మనవాళ్ళు సినిమాలలో కండ ఉన్నోడో లేదా, ఒకరిని కొట్టగలిగిన వాడినో కథనాయకుడిలా చూపిస్తున్నారేంటి? మన ప్రాచీన భారతీయత నుండి మనం ఏమీ నేర్చుకోమా?

Jun 2, 2014

"మనం" సినిమా..మంచి సినిమా


"మనం" సినిమా చూశాను..మంచి సినిమా..బాగుంది.ఎమోషనల్ కనెక్షన్స్, ఫన్ని డయలాగ్స్ బాగున్నాయి. అసలు నాగార్జున లాంటి ఇమేజ్ ఉన్న ఒక హీరో సమంత లాంటి ఒక హీరోఇన్ ని అమ్మలా ట్రీట్ చెయ్యటం, దానిని ప్రేక్షకులతో వొప్పించటం గ్రేట్. నాగార్జున ఫ్యామిలి సినిమా ఎదో 3 తరాలు ఉండాలని రికార్డ్ కోసం తీశాడులే అనుకుని సినిమాకి వెళ్ళాను.కాని మంచి కథ ఆ కథ కోసమే 3 తరాలున్న నాగార్జున ఫ్యామిలి ఉందా అన్నట్టుంది..ఈ కథని వేరే 3 హీరోలు తీయొచ్చు కాని ఈ మేజిక్ క్రియేట్ అవ్వదు. అందుకే అలా అన్నాను.ఈ సినిమాలో నటన కి ర్యాంకులు ఇస్తే 1.నాగార్జున 2.చైతన్య 3. శమంత 4. నాగేశ్వర రావు 5. శ్రియ.. last but not the least -- who is this vikram kumar...dude! nice direction and handlded the story in a nice way..ఇది ఇంటెర్నేషనల్ దమ్మున్న సినిమా కాన్సెప్ట్ అంటే ఆశ్చర్యపడనక్కరలేదు..rating 4/5

జరుగుతోంది జగన్నాటకం..


జరుగుతోంది జగన్నాటకం..జగ జగ జగ జగ జగన్నాటకం.. ఏడి ఎక్కడర... నీ హరి దాకున్నడేర భయపడి బయటకు రమ్మను రా... ఎదుటపడి నన్ను గెలవగలడా తలపడి నూ నిలిచిన ఈ నేలను అదుగు నీ నాడుల జీవజలమ్మును అడుగు నీ నెత్తుటి వెచ్చదనాన్నడుగు నీ ఊపిరిలో గాలిని అడుగు నీ అడుగుల ఆకాశాన్నడుగు నీలొ నరుని హరిని కల్పు నీవె నరహరివని నువు తెలుపు - కృష్ట్ణం వందే జగద్గురుం... నరహరి అంటే ఎక్కడినుండొ ఊడిపడలేదంట..నువ్వే నరహరివి..సగం మనిషివి..సగం మృగానివి..కృష్ట్ణం వందే జగద్గురుం... Sastri at his peaks...great!

May 29, 2014

మొదలెట్టారు..


మొదలెట్టారు.. అక్కడ నరేంద్రుడు మంత్రివర్గానికి రాబోయే 100 రోజుల ప్రణలిఖ అడిగి అప్పుడే తన బాధ్యత మొదలెట్టాడు..ఇక్కడ చంద్రబాబు నూతన రాష్ట్రానికి కావాల్సిన అర్థిక, జల, శాంతి భద్రతల దృష్ట్యా సంబంధిత కేంద్ర మంతృలతో వరుస సమావేశాలతో ఇక్కడ మొదలెట్టాడు..ఇంకొకడు కూడా మొదలెట్టాడు..నువ్వు బందులు చేసుకో నాన్నా..

May 22, 2014

పోరు ముగిసింది..


పోరు ముగిసింది.తెలుగువాడి ఆత్మగౌరవ పోరులో వోటరు ఎమోషనల్ అయ్యాడు. ఊహించిన ఫలితాలనే ఇచ్చాడు.తెలంగాణలో దొరబాబు, ఆంధ్రలో చంద్రబాబు సి.ఎం ఔతారు. సరె..ఎలాగూ దొరబాబు తెలంగాణని మరో సింగపూర్ చెసేస్తాడు లెండి.పాపం చంద్రబాబే సింగపూర్ చేస్తాడొ లేదొ చూడాలి..ఈసారికి ఎలాగో ఎమోషనల్ గేంస్ లో నాయకులొచ్చేశారు..ఇప్పుడు చెప్పిన వాగ్ధానాలు కాని చెయ్యకపోతే ఈసారి తాటతీస్తారు అని తెలుసుకోండి..సారి మర్చిపోయా మన "దివంగత నేత కుమారుడు" అనూహ్యంగా ఎక్కువ సీట్లు (అనుకున్నదానికన్న) గెలిచాడు. ఆత్మగౌరవం దెబ్బతింటే..దెబ్బ తప్పదు..ఇది గుర్తుంచుకోండి నాయకులారా..ఇది ఎవరికోచెప్పనక్కరలేదు..మీరు ఏమి చేసినా జనాలకి చెప్పి ఒప్పించి చెయ్యండి..

Mar 9, 2014

ఎలిమినేషన్ మెథడ్..voting


రాష్ట్రంలో ఒక పెద్ద అయోమయస్థితి ఉంది ఎవడిని ఎన్నుకోవాలో అని(ఒహ్ సారీ..అంటే అంధ్ర ప్రదేశ్ లో.. తెలంగాణలొ క్లారిటి ఉంది)..నిజమే అన్ని పార్టీలు కలిసి వోటర్లని బాగా కంఫూషన్ స్టేట్ లోకి నెట్టేశాయి..సరే ఈ పరిస్తితులలో ఏమి చెయ్యాలి.. మొట్టమొదట ..విభజన గురించి మర్చిపొండి..ఎవడు మనల్ని బాగ వేపుకుతిన్నాడు 10 సం|| అని ఆలోచించండి..కూరలు, బియ్యం, పచారి, కనక, వస్తు,వాహన, విద్యుత్, రవాణా,పెట్రోలు, వంట గ్యాస్ ధరలు లెక్కకు మించి పెరగడం, వ్యవసాయదారులు మమ్మల్ని పట్టించుకోవటం లేదు..మేము సెలవు తీసుకుంటాం (క్రోప్ హాలిడె) మహాప్రభో అన్నాకుడా వినిపించుకోకపోవటం.. వోక్స్ వాగన్ కుంభకొణం, ఫ్యాబ్ సిటి ఏమయ్యింది..సాఫ్ట్వేర్ ఉద్యొగాల కుదేలు..2జి, 3జి..10జి స్కాంలు..ఆర్ధిక వ్యవస్త కుదేలు..అదుపులోకి రాని ద్రవ్యోల్బణం,దానికి ఎటువంటి చర్యలు తీసుకోకపోవటం, విద్యుత్ లేక చిన్న పరిశ్రమల మూత, ఇది అయిన 8 నెలలకి చేతులు కాలాక ఆకులు పట్టుకోవటం లా కొత్త పరిస్రమలకు పిలుపు(ఫ్లాప్ అయ్యింది లెండి..)..సరయిన రాయితీలు లేక పరిస్రమల రంగం కుదేలు..ఇబ్బడిముబ్బడిగా ఇంజనీరింగు కాలేజీల పెంపు (ఒకేసారి 50కె సీట్ల నుండి 1,30,000),ఉద్యోగాలు లేక యువత కష్టాలు, సెజ్ లు వలన భూ భాగోతం, ఖజానాలో దబ్బులేదురా అన్న వినిపించుకోకుండ..ఫ్రీ..ఫ్రీ..ఫ్రీ..అన్నీ ఫ్రీ.ఎలా ఆదుకుంటారు ఏమి పీకగలరు..చిట్ట చివరిగా ఒక పద్దతి పాడు లేకుండా విభజన..చిన్న పెద్ద, ముసలి ముతక తేడా లేకుండ రోడ్డు ఎక్కితే కనీసం జవాబుదారితనం లేదు..విభజన జరిగినా ఎవరికి అన్యాయం జరగదు అని ఒక హామి అధికారికంగా లేదు..ఇరుప్రాంత ప్రజలకి భరోసా ఇచ్చే ప్రకటనలు లేవు...ప్రజలకి అవగాహన కలిపించే నాధుడు లేడు..ఇది మన భారతం..ఎవడిని నమ్మాలి..ఎన్నికలొచ్చాయి మళ్ళీ అదె బాట..ఫ్రీ..ఫ్రీ..రండి బాబు రండి.. ఇప్పుడు మనకు కావాల్సింది ఫ్రీ కాదు..ఇప్పటికైన కళ్ళుతెరవండి.. ఇంత చేసిన కాంగ్రెస్సు ఇంక భూస్తాపితం చెయ్యండి..ఆటలో అరటిపండులా మళ్ళీ వీల్ల చేతుల్లొ పెట్టకండి..వీళ్ళకి అధిస్టానం మాటే వేదం..సొంత అభిప్రాయాలుండవు..అందుకే సరయిన మెజారిటి వేరే వాళ్ళకి ఇవ్వండి... ఎలిమినేషన్ మెథడ్: నో కాంగ్రెస్స్, దాని పిల్ల పార్టిలు వై.ఎస్.అర్, కిరణ్ కొత్త పార్టి లకి నో, పవన్ కల్యాన్ పార్టి (ఒక వేళ పెడితే) పెద్ద జోక్..ఇక మిగిలింది టి.డి.పి. మరియు లోక్సత్త..లోక్సత్త వస్తే మంచిదే..కాని ఇస్తే ఫుల్ మెజారిటి ఇవ్వండి లేకపోతే టి.డి.పి కి ఇవ్వండి..అంతే కాని అటు ఇటు కాని పార్టీలని ప్రోత్సహించవద్దు..చంద్రబాబు మంచి స్టేట్స్మాన్..అని నా అభిప్రాయం..లేదు నేను ఎవడి మాట వినను అంటే.."వోట్ ఫర్ నన్" అయినా వేసి చావండి...అంతే కాని పనికిమాలిన వెదవలకి అనవసరంగా వెయ్యొద్దు..

Feb 25, 2014

పూర్ణస్య.. పూర్ణమిదం..

పూర్ణస్య పూర్ణమిదం..సున్నలో నుండి సున్న తీసేస్తే సున్నయే మిగుల్తుంది..అని అర్థం చేసుకుంటే అందులో అర్థం లేదు..పూర్ణం అంటే అందులో సంపూర్ణం, అనంతం అని అర్థం ఉంది అని తెలుసుకుంటే...దాని అర్థమే అనంతం..అదే భారతీయతలోని గొప్పతనం...నేటి యువత పూర్ణం అంటే "సున్న" అనుకుంటుంది...

పైసా..సినిమా..చూడండి..

"పైసా" మంచి సినిమా.బాగుంది..3.5/5 విచిత్రంగా సినిమా మొత్తం కృష్ట్ణవంశి కన్నా "నాని"యే కనిపించాడు. కెథరిన్ చాల బాగా చేసింది, తన పాత్ర లొ "వంశి" శైలి బాగా కనిపించింది. కొత్త మ్యూసిక్ డైరెక్టెర్ అయినా బ్యాగ్రౌండ్ బాగా ఇచ్చాడు. అంతర్లీనంగా ఈ సమాజం లొ మనం డబ్బు వెనకాల ఎల పడుతున్నమో చెప్పాడు. ఈసీమనీ కోసం ఎంతకైన తెగించేవాళ్ళు ఎక్కువయ్యారని.. వీధి రౌడీలకి కూడా కోట్లు సంపాదించాలనే ఆశ..దాన్ని వాడుకుంటున్న రాజకీయ నాయకులు..కోట్ల హవాలా కుంభకోణాలు..ఆఖరికి ప్రాణం కన్నా డబ్బుకి ఇచ్చే విలువలు...కొసమెరుపు 2 రాజకీయనాయకుల క్యారక్టెర్స్...ఒకడు కోస్తాలో మద్యం దుకాణాల కాంట్రాక్టెర్..రాష్ట్రానికి పెద్దదిక్కైపోదామనుకుని ఊర్లో రౌడీలని ఎలా వాడుతున్నాడో చూపిస్తే ఇంకొకడు ఎలగైనా సి.ఎం అయిపోవాలి అని వాళ్ళ ఊరి రౌడీలకి డబ్బు వెదజల్లి వాల్ల తరతరాలకి దేవుడైపొయే క్యారక్టెర్..క్లూ ఎంటంటే కదప నాటు బాంబులు..ఈ రాజకీయ నయవంచకులు ఎవరై వుంటారు చెప్మా? హ హ హ..

Jan 27, 2014

సినిమా ఒక మాధ్యమం..

సినిమా ఒక మాధ్యమం..అది ఏ ఎమోషన్ అయినా చెప్పొఛ్చు..చైతన్యం, అశ్లీలం, రౌద్రం, అవసరం, సమాజం, థ్రిల్, కుటుంబం, విలువలు, భయం...ఒక్కొక్క దర్శకుడు తన వ్యూస్ ని వ్యక్తీకరిస్తాడు..ఒక్కో ఎమోషన్ కి ఒక్కో ప్రేక్షకుడుంటాడు..కొన్ని సినిమాలు వినోదాన్ని పంచితే కొన్ని సినిమాలు ఆలోచింపచేస్తాయి..కొన్ని సినిమాలు బాధ్యత చెప్పితే కొన్ని సినిమాలు రాహిత్యాన్ని చెప్తాయి..ఏదైనా ఎమోషనే..