Tabs



Oct 28, 2014

ప్రజలు-వర్గాలు-ప్రభుత్వాలు..


నేటి రాజకీయ పార్టీలు, ప్రభుత్వాల తీరుని బట్టి నాకెందుకో ప్రజలని 3 రకాలుగ విభజించాలనిపించింది. 1.నిరాశావాదులు 2.ఆశావాదులు 3.అత్యాశావాదులు

నిరాశావాదులు : ఏ ప్రభుత్వం వచ్చినా మనకేమి చేస్తారులే, ఎవరు వచ్చినా ఒకటే. వీళ్ళ దృష్టిలో అందరూ ఒకేలా కనిపిస్తారు.కాబట్టి వీళ్ళు ఎవరికి సపోర్ట్ చెయ్యరు. మార్పు వీళ్ళవల్ల సాధ్యపడదు.

ఆశావాదులు: వీళ్ళు, కొంచెం మంచిచేసినా వీడు వస్తే బాగుండు అనుకుంటారు. ప్రతీఒక్కడిలోని ఎప్పుడో ఒకప్పుడు మంచి చూడగలరు. ఎన్నిసార్లు ఎంతమంది ఏమి చెప్పినా నమ్ముతారు. చెయ్యకపోతే తిడతారు, కాని మళ్ళీ నమ్ముతారు.మార్పు వీళ్ళవల్లే సాధ్యపడుతుంది.వీడేమి చేస్తాడో చూద్దాం అన్నట్లుంటుంది వీళ్ళ ధోరణి.

అత్యాశావాదులు: వీళ్ళు అందరూ సన్నాసులే అంటారు. అందరూ దొంగలే అంటారు. అందరిలోనూ ఎదోఒక మచ్చ చూస్తూనే ఉంటారు. ఒక పెద్ద తెల్లకాగితంలో చిన్న మచ్చని కూడా వదలరు. అంత అయిడియల్ గా ఉండాలి అంటారు. ఇలాంటివారు ఎవరూ ఉండరాయె. కాబట్టి వీళ్ళు ఎవరికి సపోర్ట్ చెయ్యరు. మార్పు వీళ్ళవల్ల సాధ్యపడదు.

వీళ్ళందరూ కాక ఇంకొక వర్గం ఉంది. అదే అవకాశవాదులు..వీళ్ళని గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఇప్పుడు ఊహించుకొండి మీరు ఏ వర్గం లోకి వస్తారో..

Oct 18, 2014

విశాఖలో ఒక పాజెటివ్ వేవ్..ఇలాగే ముందుకి వెళ్దాం..


విశాఖలో ఇప్పుడు ఒక పాజెటివ్ వేవ్ అనండి లేదా ఒక పాజెటివ్ శక్తి అనండి ప్రవహిస్తుందనిపిస్తుంది.రాష్ట్రం నలుమూలల నుండి అది వీస్తుంది.అందరినీ ఉత్తేజపరుస్తుంది. ఈ వేవ్ కనక ఇలాగే వీస్తే చాలా కొద్ది సమయంలో తిరిగి రెట్టించిన ఉత్సాహంతో రాష్త్రం అభివృద్ధి పథంలో నడుస్తుంది అనటంలో సందేహంలేదు. ఇప్పటికీ నెగటివిటి వెనక్కిలాగడానికి ప్రయత్నిస్తుంది కాని మనం లొంగకూడదు. అందరూ చెట్లు నాటటంలో కూడా భాగస్వామ్యం కావాలి. ఇకపోతే ఈ చెట్లు నాటటంలో అగ్రికల్చర్ విద్యార్థులని సూపర్వైజర్లుగా వాడుకుంటామని సీ.ఎం గారు ప్రకటించారు.ఇంకా అరకు, పాడేరు లో 5లక్షల ఎకరాలలో కాఫి పండించవచ్చు అని గుర్తించారు.నిజంగా అందుబాటులోనున్న సంపద ఏదైన సమర్ధవంతంగా వాడుకోవటం ఈయనకి వెన్నతోపెట్టిన విద్య అని వేరే చెప్పనక్కరలేదు.విశాఖలో వ్యవస్థలని వీలైనంతవరకు "అండర్ గ్రౌండ్" చేస్తామని ప్రకటించారు(మళ్ళీ ఇంకో తుఫాన్ కి దొరకకుండా). ఈ దీపావళికి విశాఖలో బాణాసంచా వద్దు, దీపాలతో అలంకరించుకోండి అని చెప్పి బాధ్యతని గుర్తుచేశారు (ఇప్పుడున్న పరిస్థితులలో ఫైర్ ఇంజిన్ సప్లయ్ కష్టం). వచ్చే దీపావళిని ఇంకా ఆనందంగా జరుపుకుందామని చెప్పి జనాలలో ఆశాభావాన్ని రేకెత్తించారు. మారుతి రావు గారు నిన్న చెప్పినట్టు నిరాశని మాత్రం దగ్గరకి రానివ్వటంలేదు.ఇది చాలు..ఇలాగే ముందుకి వెళ్ళాలని ఆశిద్దాం..ఫినిక్ష్ అనే పక్షి మంటలలో తనని తానే కాల్చుకొని మళ్ళీ ఆ బూడిద నుండే అందంగా పుడుతుందట..అలాగే విశాఖ కూడా మరింత అందంగా వికశిస్తుందని ఆశిస్తున్నా..

Oct 14, 2014

ఎ.పి సి.ఎం సహాయనిధి: AP CM relief fund


పెద్దమనసున్నొళ్ళు పెద్ద పెద్ద విరాళాలు పంపారు..ఉడతాభక్తిగా మనమూ పంపిద్దాం: AP CM Relief Fund, SBI account-33913634404, IFSC Code-SBIN0002724, Branch Name, SBI Treasury Branch, Gowliguda, Hyderabad

హుద్ హుద్: కొంచెం సమ్యమనం పాటించండి.


ఒక బస్తీకి 5 పెద్దలారీల నిత్యావసరాలు వరదబాధితుల సహయార్థం వస్తే జనాలు ఎప్పటిలాగే ఎగబడి తీసుకుంటున్నారు..ఎవరికి ఎన్ని వెల్తున్నాయి, ఒకరే 2/3 తీసుకున్నా తెలియని పరిస్థితి.పోలీసులున్నారు, తక్కువమంది..ఎక్కువమంది మిగతా సహాయకచర్యల్లొ ఉన్నారు.వీళ్ళు మాత్రం ఏమి చెయ్యగలరు, లాఠి చార్జి చెయ్యలేరు కదా.ఇది జనాలలో ఉండాలి. ఇది ఇలా ఉంటే మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి వాళ్ళు గుంపులో ఎగబడడానికి అభిమానం అడ్డొస్తుంది. వాళ్ళు ఈ సాయాన్ని తీసుకోరు. వాళ్ళకి కరెంటు, తాగునీరు, పాలు డబ్బులకి దొరికితే చాలు అనుకుంటారు. ఇవి అయినా వెంటనే ఎలావస్తాయి..మొత్తం 3 జిల్లాలు ఊడ్చిపెట్టుకుపోయాయి కరెంటు స్థంభాలు, అన్నింటిని సరిచేసి చెక్ చేసుకోవటనికి చాలా టైం పడుతుంది.పాలు కలెక్షన్ కి వెళ్ళాలంటే పల్లెలకి రోడ్లు, వాహనాలకి డీసిల్ ఉండాలి. రెండు లేవు.మరి పాలు ఎలావస్తాయి.తాగునీటికి జెనరేటర్లు వినియోగిస్తున్నారు. ఒకేసారి సిటీ మొత్తానికి ఇవ్వాలి.కొంచెం సమ్యమనం పాటిస్తూ మనకి వీలయిన ప్రత్యామ్నాయాలు మనం చూసుకోవటం మంచిది.వీలైతే వేరే ఊళ్ళో మీ బంధువుల ఇంతికి వెల్లటం మంచిదేమో.

Oct 13, 2014

"హుద్ హుద్" ప్రకృతివిలయం..శభాష్ చంద్రబాబు..


మూలిగే నక్కపైన తాటిపండుపడ్డట్టు..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి "హుద్ హుద్" అపారనష్టాన్ని మిగిల్చింది. పాపం ఎన్నో కుటుంబాలు రోడ్డునపడితే నేను సామెతతో మొదలుపెట్టిపోల్చడం నాకే కొంచెం చిరాగ్గ అనిపిస్తుంది. ఏది ఏమైనా ప్రభుత్వం/చంద్రబాబు, అధికార్ల అప్రమత్తత వల్ల ఎన్నో ప్రాణాలను రక్షించగలిగారు. ఈ భీభత్స పరిస్థితులు నాకు తెలిసి ఎప్పుడూ చూడలేదు. అప్రమత్తత అంటే ఎలా ఉండాలి అన్నవిషయం లో రాబొయే ప్రభుత్వాలకి బెంచ్ మార్క్ ఇచ్చాడు అనటంలో అతిశయొక్తి కాదు. చాలామంది నాకుతెలిసి ఇది "మామూలు" తూఫానె అనుకున్నారు, రాకముందు..అందుకే ప్రభుత్వ ప్రకటనని కూడా లెక్క చెయ్యకుండా ప్రయాణాలకి వెళ్ళి ఇరుక్కున్నారు. అందులో కొంతమంది ప్రభుత్వాన్ని నిందించటం కూడా మొదలెట్టారు మైక్ దొరికేసరికి.బయటిప్రపంచంతో సంబంధాలు తెగిన కొంతమంది కూడా నిందించటం మొదలెట్టారు..ఎందుకంటే వాళ్ళకి తమ ఊరుకాక మిగతా ఊళ్ళు, పట్టణాలు ఎంత దెబ్బతిన్నయో తెలిదు కాబట్టి..ఇలాంటి పరిస్తితులలో ఒక బాధ్యతగల వ్యక్తిగా సి.ఎం. అన్ని కార్యకలాపాలు అక్కడినుండే జరపమనడం అక్కడి ప్రజలకి ఎంతో ధైర్యం ఇచ్చేవిషయం. అన్ని పొరుగు రాష్ట్రాలని సంప్రదించి, ప్రధానితో కూడా మాట్లాడి అదనపు సహాయం పొందటం దగ్గరనుండి..టెక్నాలజి ని అందినంతవరకు వినియోగించుకోవటం..ముందస్తు జాగ్రత్తలతో యంత్రాంగాన్ని అప్రమత్తం చేయటం వరకు..ఇంకా వాళ్ళతో కలిసి పనిచేస్తూ వీలైనంత త్వరలో అన్ని విభాగాలని రెజ్యూం చేయటం చూస్తుంటే..ఇంకో ప్రభుత్వం ఉంటే ఇలా చెయ్యగలదా అని అనిపిస్తుంది! ఇంకా..ఎంతో దీక్షగా అక్కడ సేవలని వినియోగిస్తున్న వారందరికి ధన్యవాదములు! ఇలాంటి సమయాల్లో ఎప్పుడు రాజకీయం చేద్దామా అని చూసే వాళ్ళకి (అదే..ప్రతిపక్షం) నేనొక్కటే చెప్పేది..వీలైతే సహాయం చెయ్యండి, అంతే కాని ఇప్పుడు రాజకీయం చెయ్యాలని చూస్తే కనీసం ఇంకో రెండుతరాలకి మీరు దూరమౌతారు..

Oct 1, 2014

గోవిందుడు అందరివాడేలే..


దసరా పండగ రెండు రోజులముందే తెచ్చాడు కృష్ణవంశి.నిండుగా కుటుంబం అంతా కలిసి చూడొచ్చు సినిమా..అదేనండి "గోవిందుడు అందరివాడేలే". కృష్ణవంశి మార్కు సినిమా. .ఒకట్రెండు దగ్గర మన "మురారి" కనపడ్డాడు "రాం" లో..రాం నటుడిగా ఇంకా కొంత ఇంప్రూవ్ అవ్వాలి.కష్టపడ్డాడు అనుకోండి.. ఎమోషన్ ప్రేక్షకులలో ఇంకా రిజిస్టెర్ అయితే బాగుండు అనిపించింది.మొత్తానికి ఒక "అబోవ్ ఆవెరేజ్"..అదె అదె హిట్టేలెండి...