Tabs



Sep 21, 2014

ఉత్తరాంధ్రకి ఎప్పుడూ మొండి చెయ్యేనా?


ఒక నాయుడు గారు విశాఖ ని "మెగాసిటి" చేస్తానంటే, ఒక నాయుడుగారు (కేంద్రం నుండి) విశాఖ స్మార్ట్ సిటియే అంటున్నారు. అదికాక ఇంటెర్నేషనల్ ఎయిర్పోర్ట్ అన్నారు ఇప్పుడు నేవి వాళ్ళు ఒప్పుకోవట్లేదంటున్నారు. మరి శ్రీకాకుళాన్ని ఫార్మా కంపు, కాలుష్యం తో నింపేస్తున్నారు, విశాఖ లో బొగ్గు కాలుష్యం ఉండనే ఉంది. బాబూ.. మా ఉత్తరాంధ్రలో మీకు కనపడనివి ఇంకా చాలానే ఉన్నాయి. పెద్దగా పంటలు పండని నేలలు, ఊరికే వరదలతొ మునిగిపోయే పంటలు, అడవులు, కష్టపడి పని చేసి ఫలితం పెద్దగా ఆశించని మనుషులు, ఏ ప్రభుత్వం ఉన్నా మనకేమి లాభంలే అనుకునే నిరాశా జీవులు-చదువుకున్న అఙానులు, అభద్రతాభావ విద్యార్థులు, ఎన్నెన్నో వలసలు..ఇంకెన్నో నాకుతెలియని కష్టాలు..ఇంకా అందమయిన విశాఖ నగరం,సహజంగా ఏర్పడ్డ పోర్టు, ఉక్కునగరమని పేరు, సిమ్హాద్రి అప్పన్న సామి, చదువుకున్నా ఉద్యోగావకాశాలు లేక దేశ విదేశాలు పోయి "వలసబతుకు" బతుకుతున్న నిపుణులు..అందరూ ఎవరో వస్తారని ఏదో చేస్తారని బలంగా నమ్ముతున్నవారే, ఎప్పుడూ వెనకబాటు.. వెనకబాటు అని ఊదరగొట్టడమేకాని మాకు ఏ ప్రభుత్వం వచ్చినా ఒరిగింది ఏమీలేదు. నాయకుల జేబులు నిండుతున్నాయి తప్ప..మా ప్రాంత నాయకులకి ఇప్పటికైనా చెప్పేది ఒకటే.. ఇప్పటికైన సిగ్గు తెచ్చుకోండి..ప్రజలకోసం అడగండి, మిగిలిన ఎంగిలి మెతుకులు ఏరుకొని బతకటం మనకి వద్దు..అలాగే ఇంకొకటి గుర్తుపెట్టుకోండి "ప్రత్యేకం/విభజన" నా ఆకంక్ష కాదు.. తెలుగు ప్రజలు ఇంకొక విభజనని కోరుకోవటం లేదు..అభివృద్ధి కోరుతున్నాం..అంతే.

No comments:

Post a Comment