Tabs



Sep 29, 2014

గూగుల్-తెలుగు భాష-డిమాండ్?


తెలుగు 'ఫాంట్' ను డిజిటలైజ్ చేయడమే లక్ష్యం అంటూ ఆంద్రప్రదేశ్ లో ప్రకటన చేసిన గూగుల్ నిజంగ తెలుగు 'ఫాంట్' కి అంత డిమాండ్ ఉందని అనుకుంటుందా? ఎదో కొద్దిమంది తప్ప తెలుగుని మర్చిపోయే రోజులొచ్చాయేమొ అని నాకు అనిపిస్తుంది. రాష్త్ర ప్రభుత్వం తెలుగు ప్రాముఖ్యత విద్యావిధానం లో పెంచితే ముందు తరాలలో ఈ భాష చచ్చిపోకుండా మనగలుగుతుంది.ముందు ఆ దిశలో అడుగు వెయ్యాలి. ఇంకా, మంచి సంస్థలు ముందుకొచ్చి తెలుగు భాషలోని అద్భుత కావ్య మాధుర్యాన్ని డిజిటలైజ్ చెయ్యాలి. అప్పుడు, అందులో ఆశక్తి వున్నవాళ్ళతోనైన డిజిటల్మీడియ అభివృద్ధి చెంది మళ్ళీ మనకి ఉద్యోగాలు క్రియేట్ చేస్తుంది. భూమి గుండ్రం ఉంటుంది కదా? అలాగే మన భాషా సంపద చచ్చిపోదు కూడా!

6 comments:

  1. ఈ రోజున జనానికి తెలుగులో మాట్లాడటానికి ఎంతో నామోషీ. తీరా ఎవరైనా ఈ తరాల వాళ్ళు తెలుగులో మాట్లాడితే వినటానికి మా తరానికి చచ్చే భయం. అదీ పరిస్థితి.

    ReplyDelete
    Replies
    1. నేను ఈతరం వాడినే అయినా మీతో ఏకీభవిస్తున్నా శ్యామలీయంగారు.

      Delete
  2. ముందరగా, తెలుగు భాష అభివృద్ధికీ గూగుల్ వారి పరి'శ్రమ అభినందనీయం. ఈ రోజున నెట్ భావిలోకీ కూడా తెలుగు ప్రవేశించింది. అన్ని తెలుగులోనే వ్రాసుకోగలుగుతున్నాము. అనేక ఇంగ్లిష్ సినిమాలు కొత్తవి కూడా తెలుగు డబ్బింగుతో వస్తున్నాయి... యురప్పు వారు డబ్బు లేని/రాని దానిని గుర్తించరు. కనీసం దానిబట్టి అయినా తెలుగు అభివృద్ధి చెందుతోందని తెలుసుకోవచ్చును.

    తరవాత, మన చుట్టు ఉన్న ప్రపంచమే ప్రపంచం అనుకుంటే...అది పొరబాటు. తెలుగు భాష ఎదో అయిపోతోందని మునిగి పోతోందని ఎక్కడో ఆఫీసుల్లో కూర్చొనే వారు అనుకోవాలే గాని, రాష్ట్రంలో బయట తిరిగితే తెలుగు ఎలా అభివృద్ధి చెండుతోందో తెలుస్తుంది...తెలుగు ఇదివరకు కన్నా చాలా అభివృద్ధి చెందింది. చెందుతోంది...దానికి వచ్చిన ముప్పేమీ లేదు...

    ReplyDelete
    Replies
    1. తెలుగుభాష అభివృద్ధికి మనం పెట్టుకొనే పేర్లు వేరు రాధాకృష్ణగారు. అభివృద్ధి అంటే నా వుద్దేశ్యంలో తెలుగు ఎక్కువమంది మాట్లాడటమే కాదు, భాషా సంపద కూడా పెరగాలి.కొత్త పదాలు చేరాలి, పద్యభాగం, కవిత్వం కూడా పెరగాలి.ఈరోజుల్లో విద్యార్థులకి మేము చదువుకున్న తెలుగు స్టాండర్డ్ కూడాలేదు. యతి-ప్రాస, గణాలు తెలీవు.మావరకు కొంత పద్యాన్ని అర్థం చేసుకోగలం..కాని ఇప్పటివారు వేమన శతకానికి కూడా అర్థం కూడా వేరొకరు చెప్తేకాని అర్థం చేసుకోలేరు.పద్యాన్ని ఎందుకు అర్థం చేసుకోవాలి అని మీరు అడగవచ్చు.. పూర్వకాలం లో మనభాష సౌందర్యం, ఛలోక్తులు, చాటువులు, చమత్కారాలు, విఙానం, భక్తి భావన ఇంకా చాల పద్యభాగంలోనే నిక్షిప్తమైఉంది.తెలుగు భాషాభివృద్ధి గురించి తెలుగు లెంకలో రాంగారు చెప్పింది వారి మాటల్లొనే: https://www.youtube.com/watch?v=HL8iiXXnl8c

      Delete
  3. మా తెలుగు తల్లి
    ఈ మధ్య ఓ పత్రికలో ఇంగ్లీషులో పది లక్షల పదాలు చేరాయి అనే చర్చలో తెలుగులో ఎన్ని పదాలున్నై అనే విషయం ప్రస్తావించబడింది. కాని నా వుద్దేశంలో అందరూ తెలుగులో ఎన్ని పదాలున్నాయని లెక్కపెట్టడం మానేసి, ఎన్ని పదాలు పోగొట్టుకొంటున్నామో లెక్కపెట్టండి. మన పక్కింటి భాష తమిళంలోకి ప్రతి ఇంగ్లీషు పదానికి సరిఅయిన పదాలను సృష్టించి పదసంపదను పెంచుకుంటున్నారు. ఇంటర్నెట్టు, ఫ్యాక్సు లాంటి వాటికి కూడా తమిళ పదాలు వాడకంలో ఉన్నాయి. ఆ మధ్య మాలతీ చందూర్ గారు అరవల భాషాభిమానాన్ని గురించి స్వాతిలో ముచ్చటించారు. మమ్మీ డాడీ అని పిలిపించుకుని మురిసి పోయే అమ్మా నాన్నలు వున్నంత కాలం తెలుగు భాషకు చెదలు పట్టకుండా చూసుకోవాలి మనం!

    మమ్మీ డాడీ అని పిలిపించుకునే తెలుగు మాతా పితలు తెలుగునేమి ఉద్ధరిస్తారయ్యా ?
    మా తెలుగు తల్లికి మల్లె పూదండ అని ఇంగ్లీషులో వ్రాసుకుని పాడే పిల్లల తల్లి దండ్రులయ్యా వీరు
    డాలర్ల కోసం పరుగెత్తిన పుత్రసంతానాన్ని తల్చుకుని గర్వించే జీవులయ్యా వీరు
    ఈ తెలుగు సాయంత్రం తేవాలి తెలుగు భాషా ప్రపంచానికి మరో ఉదయం!

    ReplyDelete