Tabs



Oct 13, 2014

"హుద్ హుద్" ప్రకృతివిలయం..శభాష్ చంద్రబాబు..


మూలిగే నక్కపైన తాటిపండుపడ్డట్టు..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి "హుద్ హుద్" అపారనష్టాన్ని మిగిల్చింది. పాపం ఎన్నో కుటుంబాలు రోడ్డునపడితే నేను సామెతతో మొదలుపెట్టిపోల్చడం నాకే కొంచెం చిరాగ్గ అనిపిస్తుంది. ఏది ఏమైనా ప్రభుత్వం/చంద్రబాబు, అధికార్ల అప్రమత్తత వల్ల ఎన్నో ప్రాణాలను రక్షించగలిగారు. ఈ భీభత్స పరిస్థితులు నాకు తెలిసి ఎప్పుడూ చూడలేదు. అప్రమత్తత అంటే ఎలా ఉండాలి అన్నవిషయం లో రాబొయే ప్రభుత్వాలకి బెంచ్ మార్క్ ఇచ్చాడు అనటంలో అతిశయొక్తి కాదు. చాలామంది నాకుతెలిసి ఇది "మామూలు" తూఫానె అనుకున్నారు, రాకముందు..అందుకే ప్రభుత్వ ప్రకటనని కూడా లెక్క చెయ్యకుండా ప్రయాణాలకి వెళ్ళి ఇరుక్కున్నారు. అందులో కొంతమంది ప్రభుత్వాన్ని నిందించటం కూడా మొదలెట్టారు మైక్ దొరికేసరికి.బయటిప్రపంచంతో సంబంధాలు తెగిన కొంతమంది కూడా నిందించటం మొదలెట్టారు..ఎందుకంటే వాళ్ళకి తమ ఊరుకాక మిగతా ఊళ్ళు, పట్టణాలు ఎంత దెబ్బతిన్నయో తెలిదు కాబట్టి..ఇలాంటి పరిస్తితులలో ఒక బాధ్యతగల వ్యక్తిగా సి.ఎం. అన్ని కార్యకలాపాలు అక్కడినుండే జరపమనడం అక్కడి ప్రజలకి ఎంతో ధైర్యం ఇచ్చేవిషయం. అన్ని పొరుగు రాష్ట్రాలని సంప్రదించి, ప్రధానితో కూడా మాట్లాడి అదనపు సహాయం పొందటం దగ్గరనుండి..టెక్నాలజి ని అందినంతవరకు వినియోగించుకోవటం..ముందస్తు జాగ్రత్తలతో యంత్రాంగాన్ని అప్రమత్తం చేయటం వరకు..ఇంకా వాళ్ళతో కలిసి పనిచేస్తూ వీలైనంత త్వరలో అన్ని విభాగాలని రెజ్యూం చేయటం చూస్తుంటే..ఇంకో ప్రభుత్వం ఉంటే ఇలా చెయ్యగలదా అని అనిపిస్తుంది! ఇంకా..ఎంతో దీక్షగా అక్కడ సేవలని వినియోగిస్తున్న వారందరికి ధన్యవాదములు! ఇలాంటి సమయాల్లో ఎప్పుడు రాజకీయం చేద్దామా అని చూసే వాళ్ళకి (అదే..ప్రతిపక్షం) నేనొక్కటే చెప్పేది..వీలైతే సహాయం చెయ్యండి, అంతే కాని ఇప్పుడు రాజకీయం చెయ్యాలని చూస్తే కనీసం ఇంకో రెండుతరాలకి మీరు దూరమౌతారు..

No comments:

Post a Comment