విశాఖలో ఇప్పుడు ఒక పాజెటివ్ వేవ్ అనండి లేదా ఒక పాజెటివ్ శక్తి అనండి ప్రవహిస్తుందనిపిస్తుంది.రాష్ట్రం నలుమూలల నుండి అది వీస్తుంది.అందరినీ ఉత్తేజపరుస్తుంది. ఈ వేవ్ కనక ఇలాగే వీస్తే చాలా కొద్ది సమయంలో తిరిగి రెట్టించిన ఉత్సాహంతో రాష్త్రం అభివృద్ధి పథంలో నడుస్తుంది అనటంలో సందేహంలేదు. ఇప్పటికీ నెగటివిటి వెనక్కిలాగడానికి ప్రయత్నిస్తుంది కాని మనం లొంగకూడదు. అందరూ చెట్లు నాటటంలో కూడా భాగస్వామ్యం కావాలి. ఇకపోతే ఈ చెట్లు నాటటంలో అగ్రికల్చర్ విద్యార్థులని సూపర్వైజర్లుగా వాడుకుంటామని సీ.ఎం గారు ప్రకటించారు.ఇంకా అరకు, పాడేరు లో 5లక్షల ఎకరాలలో కాఫి పండించవచ్చు అని గుర్తించారు.నిజంగా అందుబాటులోనున్న సంపద ఏదైన సమర్ధవంతంగా వాడుకోవటం ఈయనకి వెన్నతోపెట్టిన విద్య అని వేరే చెప్పనక్కరలేదు.విశాఖలో వ్యవస్థలని వీలైనంతవరకు "అండర్ గ్రౌండ్" చేస్తామని ప్రకటించారు(మళ్ళీ ఇంకో తుఫాన్ కి దొరకకుండా). ఈ దీపావళికి విశాఖలో బాణాసంచా వద్దు, దీపాలతో అలంకరించుకోండి అని చెప్పి బాధ్యతని గుర్తుచేశారు (ఇప్పుడున్న పరిస్థితులలో ఫైర్ ఇంజిన్ సప్లయ్ కష్టం). వచ్చే దీపావళిని ఇంకా ఆనందంగా జరుపుకుందామని చెప్పి జనాలలో ఆశాభావాన్ని రేకెత్తించారు. మారుతి రావు గారు నిన్న చెప్పినట్టు నిరాశని మాత్రం దగ్గరకి రానివ్వటంలేదు.ఇది చాలు..ఇలాగే ముందుకి వెళ్ళాలని ఆశిద్దాం..ఫినిక్ష్ అనే పక్షి మంటలలో తనని తానే కాల్చుకొని మళ్ళీ ఆ బూడిద నుండే అందంగా పుడుతుందట..అలాగే విశాఖ కూడా మరింత అందంగా వికశిస్తుందని ఆశిస్తున్నా..
Oct 18, 2014
విశాఖలో ఒక పాజెటివ్ వేవ్..ఇలాగే ముందుకి వెళ్దాం..

Subscribe to:
Post Comments (Atom)
కలియుగం ప్రధమపాదంలొ రామరాజ్యం వస్తుందా.
ReplyDeleteఎర్రచందనందొంగలకి ఇసుకసిండికేట్లకి కాన్ట్రాక్టుసిండికేట్లకి లిక్కర్సిండికేట్లకి సిమెంటువన్టికంపెనీసిండికేట్లకి (వ్యవస్తలో ప్రజాస్వామ్యాన్ని )నాశనంచేస్తున్న వాటికి తేడా ఏమిటి.
(’ధనంమూలం ఇదంజగత్తంటే’) డబ్బు రాజుఅధీనంలో ఉంటే నే ప్రజలు ప్రభుత్వాలు రాజుఅధీనంలో ఉంటాయి, నల్లధనం నశించాలి.
అందరూ సుఖంగా ఉండాలంటే ఎవరికి వారు వారెవరో తెలుసుకోవాలి.
అంటే నేను ఎవరు ? ఈభూమిమీదకు ఎక్కడి నుంచి వచ్చాను ? ఎందుకు వచాను ? ఏమిచేయాలి ? అని ప్రశ్నించుకోవాలి.
అంతా నా భ్రమేనంటారా? అంతే అయ్యుంటుందిలెండి..
Delete