Tabs



Sep 29, 2014

గూగుల్-తెలుగు భాష-డిమాండ్?


తెలుగు 'ఫాంట్' ను డిజిటలైజ్ చేయడమే లక్ష్యం అంటూ ఆంద్రప్రదేశ్ లో ప్రకటన చేసిన గూగుల్ నిజంగ తెలుగు 'ఫాంట్' కి అంత డిమాండ్ ఉందని అనుకుంటుందా? ఎదో కొద్దిమంది తప్ప తెలుగుని మర్చిపోయే రోజులొచ్చాయేమొ అని నాకు అనిపిస్తుంది. రాష్త్ర ప్రభుత్వం తెలుగు ప్రాముఖ్యత విద్యావిధానం లో పెంచితే ముందు తరాలలో ఈ భాష చచ్చిపోకుండా మనగలుగుతుంది.ముందు ఆ దిశలో అడుగు వెయ్యాలి. ఇంకా, మంచి సంస్థలు ముందుకొచ్చి తెలుగు భాషలోని అద్భుత కావ్య మాధుర్యాన్ని డిజిటలైజ్ చెయ్యాలి. అప్పుడు, అందులో ఆశక్తి వున్నవాళ్ళతోనైన డిజిటల్మీడియ అభివృద్ధి చెంది మళ్ళీ మనకి ఉద్యోగాలు క్రియేట్ చేస్తుంది. భూమి గుండ్రం ఉంటుంది కదా? అలాగే మన భాషా సంపద చచ్చిపోదు కూడా!

Sep 21, 2014

ఉత్తరాంధ్రకి ఎప్పుడూ మొండి చెయ్యేనా?


ఒక నాయుడు గారు విశాఖ ని "మెగాసిటి" చేస్తానంటే, ఒక నాయుడుగారు (కేంద్రం నుండి) విశాఖ స్మార్ట్ సిటియే అంటున్నారు. అదికాక ఇంటెర్నేషనల్ ఎయిర్పోర్ట్ అన్నారు ఇప్పుడు నేవి వాళ్ళు ఒప్పుకోవట్లేదంటున్నారు. మరి శ్రీకాకుళాన్ని ఫార్మా కంపు, కాలుష్యం తో నింపేస్తున్నారు, విశాఖ లో బొగ్గు కాలుష్యం ఉండనే ఉంది. బాబూ.. మా ఉత్తరాంధ్రలో మీకు కనపడనివి ఇంకా చాలానే ఉన్నాయి. పెద్దగా పంటలు పండని నేలలు, ఊరికే వరదలతొ మునిగిపోయే పంటలు, అడవులు, కష్టపడి పని చేసి ఫలితం పెద్దగా ఆశించని మనుషులు, ఏ ప్రభుత్వం ఉన్నా మనకేమి లాభంలే అనుకునే నిరాశా జీవులు-చదువుకున్న అఙానులు, అభద్రతాభావ విద్యార్థులు, ఎన్నెన్నో వలసలు..ఇంకెన్నో నాకుతెలియని కష్టాలు..ఇంకా అందమయిన విశాఖ నగరం,సహజంగా ఏర్పడ్డ పోర్టు, ఉక్కునగరమని పేరు, సిమ్హాద్రి అప్పన్న సామి, చదువుకున్నా ఉద్యోగావకాశాలు లేక దేశ విదేశాలు పోయి "వలసబతుకు" బతుకుతున్న నిపుణులు..అందరూ ఎవరో వస్తారని ఏదో చేస్తారని బలంగా నమ్ముతున్నవారే, ఎప్పుడూ వెనకబాటు.. వెనకబాటు అని ఊదరగొట్టడమేకాని మాకు ఏ ప్రభుత్వం వచ్చినా ఒరిగింది ఏమీలేదు. నాయకుల జేబులు నిండుతున్నాయి తప్ప..మా ప్రాంత నాయకులకి ఇప్పటికైనా చెప్పేది ఒకటే.. ఇప్పటికైన సిగ్గు తెచ్చుకోండి..ప్రజలకోసం అడగండి, మిగిలిన ఎంగిలి మెతుకులు ఏరుకొని బతకటం మనకి వద్దు..అలాగే ఇంకొకటి గుర్తుపెట్టుకోండి "ప్రత్యేకం/విభజన" నా ఆకంక్ష కాదు.. తెలుగు ప్రజలు ఇంకొక విభజనని కోరుకోవటం లేదు..అభివృద్ధి కోరుతున్నాం..అంతే.

Sep 18, 2014

"గోవిందుడు అందరివాడేలే"..పాటలు బాగున్నాయిరోయ్!


"గోవిందుడు అందరివాడేలే"..కృష్ణవంశి సినిమా కదా! పాటలు వినడానికి ధైర్యం చేశాను..మొదటి ప్రయత్నంలోనే 3 నచ్చాయి.నిజానికి మా స్నేహితుడు భరోశ ఇచ్చాడులెండి (ధన్యవాదములురా విష్ణు!). యువన్ బాగా చేశాడు.ఇకపోతే ఈ సినిమాలోనైనా చరణ్ మొహంలో ఎక్ష్ప్రెషన్ కనిపిస్తుందని ఆశిస్తున్నా. ట్రైలెర్ చూస్తుంటే "వంశి" బాగాకనిపిస్తున్నాడు. మగధీర తరువాత మళ్ళీ చరణ్ ఇది మంచిపేరు తెచ్చే సినిమా అయ్యే అవకాశాలున్నాయి. [ఎవడు సినిమా లో హీరో అల్లు అర్జున్ కదా..అంతే కాకుండా నటుడిగా చరణ్ పెద్దగా సాధించింది ఎమీలేదు ఆ సినిమాలో,అందుకే మగధీర తరువాత అన్నా.] ముందు అతను ఆర్టిస్ట్ గా నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది..తరువాతే హీరో..

Sep 17, 2014

మెట్రొ ముందుకా? వెనక్కా?


తెలంగాణా ప్రభుత్వం మాకుసహకరిస్తోంది. మెట్రోలో చిన్న చిన్న సమస్యలున్న మాట వాస్తవం. వాటికి పరిష్కరించుకుంటాం. పిబ్రవరి 2014 నుండి ప్రభుత్వానికి లేఖలు రాస్తున్నాం.ఒకవేళ సమస్యలు పరిష్కారం కాకుంటే ప్రాజెక్ట్ ప్రభుత్వపరం చేస్తాము-ఎల్.అండ్.టి ఎం.డి (గార్గిల్) దీనిభావమేమి తిరుమలేశా?

Sep 12, 2014

దేశం మొత్తం చూస్తుంది..తస్మాత్ జాగ్రత్త..


సభని అవమానించడం తప్పే..అందులోనూ పొలిటీషియన్స్ ని కామెడి చెయ్యటం ఈ మధ్య బాగనే అలవాటయిపోయింది.అయితే వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు, ఇంకా ముందుకుపోయి లైసెన్సులు క్యాన్సిల్ చెయ్యొచ్చు, కాని ఏది చేసిన రాజ్యాంగబద్ధంగ ఉండాలి. అలాగే క్షమాపణ కోరినపుడు, ఒక సీరియస్ వార్నింగు ఇచ్చి వదిలితే మిగతా చానెల్స్ కూడ జాగ్రత్తగా మంచి క్వాలిటి వార్తలు ప్రసారం చేస్తాయి.ఒకప్పుడు అతను ప్రాంతీయ ఉద్యమనేత, ఎప్పుడైన రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా అది ఉద్యమకారులకు ఉత్సాహాన్ని నింపేదేమొ. కాని ఇప్పుడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆయన ఏమి మాట్లాడినా దేశం మొత్తం చూస్తుంది. అతని నడక, నడత అన్ని గమనిస్తుంది. కొత్తగా అతను ఏమి అనలేదు..తన యాసలోనే సరదాగ జోక్ చేస్తూ.. "పదికిలోమీటర్లలోపల పాతరేస్తాం..", "తెలంగాణాలో ఉండదల్చుకుంటే సల్యూట్ కొట్టి ఉండాలి" అన్నమాటలు అన్న సందర్భం వేరు, అన్యాయం చేస్తే ఊరుకోము అనే సందర్భాన్ని భాష మారేసరికి వేరే అర్థాన్ని ఇస్తూ మొత్తం నేషనల్ జర్నలిస్టుల అహం దెబ్బతిని మరిగిపోతున్నారు.అలాగే అదే సభలో రాజయ్య ని అవమానించారని కొత్త వివాదం..కాబట్టి కొంచెం సభల్లో మాట్లాడేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవటం అవసరం..లేదంటే ఇప్పటికే ఎక్కడ దొరుకుతాదా అని ఆకలితో ఎదురుచూస్తున్న టి.వీ లకి దొరుకుతూనే ఉంటాడు.ఎలక్ట్రానిక్ మీడియ పుణ్యమా అని ఎమి మాట్లాడిన వెంటనే తర్జుమా చేసి మరీ వేసేస్తున్నారు.(i mean true translation) ఔనట్టు..true translation ప్రాబ్లెం మీకు తెలుసనుకుంటా..

Sep 6, 2014

పేరు వినాయకుడిది..మరి పండగ మందుబాబులకి..


వినాయకుని పేరు చెప్పుకొని తాగడం, విపరీతమైన సౌండ్ పొల్యూషన్ అవసరమా? వినాయకుడు తాగకపోతే రానంటడా? పక్కవీధిలో పెద్ద బొమ్మ పెట్టాడని మనవీధిలో అంతకన్నా పెద్ద బొమ్మ పెట్టాలనుకోవటం అహానికి నిదర్శనం కాదా? ఎక్కడనుండి ఎక్కడికి వెళ్తున్నాం మనం?

Sep 1, 2014

బాపు-రమణీయం..


తెలుగుభాషకి చమత్కార కారాన్ని అద్దినా, తీయనైన వ్యంగ్యాన్ని అద్దినా, ఎప్పుడైనా పులుపు, వగరు..వగైరాలు తగిలినా..బాపు-రమణీయం ఉగాది పచ్చడేసుమా! తెలుగువారికి నిత్య ఉగాది ఈ స్నేహద్వయం.భావుకత బాపు కథలలో ఉంటే ఆ గీతలనిండా సొగసే మరి..మరి బుడుగో? ఈయన చిచ్చరపిడుగు కాదుట చిచ్చులపిడుగుట..హ హ హ..! భూమి మీద ధనాన్ని.. అదేనండి తెలుగు"ధనాన్ని" ఎక్కువ పంచేశారంట..మరీ ఎక్కువైతే పున్యాత్ములైపోయి కలి ప్రబలడం కష్టమని దేవుడు తన చెంతకు పిలిచేశాడనుకుంటా..పోయినోళ్ళు అందరూ మంచోళ్ళే మరి..! మీలోటు పూడ్చలేనిదే!!