తెలుగుభాషకి చమత్కార కారాన్ని అద్దినా, తీయనైన వ్యంగ్యాన్ని అద్దినా, ఎప్పుడైనా పులుపు, వగరు..వగైరాలు తగిలినా..బాపు-రమణీయం ఉగాది పచ్చడేసుమా! తెలుగువారికి నిత్య ఉగాది ఈ స్నేహద్వయం.భావుకత బాపు కథలలో ఉంటే ఆ గీతలనిండా సొగసే మరి..మరి బుడుగో? ఈయన చిచ్చరపిడుగు కాదుట చిచ్చులపిడుగుట..హ హ హ..! భూమి మీద ధనాన్ని.. అదేనండి తెలుగు"ధనాన్ని" ఎక్కువ పంచేశారంట..మరీ ఎక్కువైతే పున్యాత్ములైపోయి కలి ప్రబలడం కష్టమని దేవుడు తన చెంతకు పిలిచేశాడనుకుంటా..పోయినోళ్ళు అందరూ మంచోళ్ళే మరి..! మీలోటు పూడ్చలేనిదే!!
పరమపదించె నయ్యొ మన 'బాపు ' - మహోన్నత కార్టునిస్టు; చి
ReplyDeleteత్తరువుల సృష్టిలో యశము దాల్చు మహాద్భుత శిల్పి; అక్షరాల్
పరువపు కన్నె సోయగపు వంపుల రీతి లిఖించు స్రష్టయున్;
తెర పయి తెల్గు సంస్కృతికి దృశ్య మనోజ్ఞత గూర్చు దర్శకుం
డరయ - తెలుంగు లోకమున అంద మికెట్టుల బట్ట గట్టురో!
ఆ.వె. రాత ఘనుడు రమణ గీత ఘనుడు బాపు
ReplyDeleteరాత గీత భువిని రాజ్యమేలె
రాత నిన్న చనెను గీత నేడు చనెను
రాత గీత దివిని రాజ్యమేలు
ధన్యవాదములు..
ReplyDelete"తెలుంగు లోకమున అంద మికెట్టుల బట్ట గట్టురో??"
"రాత గీత దివిని రాజ్యమేలు"..