Nov 20, 2021
Connecting Azure CosmosDB from SoapUI Opensource using Groovy script
I had made an attempt to connect azure cosmos DB from Soapui Groovy script. this helps building tests on soapui.
1. Create a project in soapUI --> testsuite --> add a testcase.
2. Create a REST requst using the cosmosDB endpoint https://hostname:port/resType
3. Add a properties step and create few variables as mentioned below just to pass on the input data or you can hardcode inside the code.
4. add a groovy script step and paste below code
5. Create Headers with names - Authorization (value will be filled by below code), x-ms-version (value find latest version date on google eg.2018-12-31), x-ms-date (will be filled by below code, Accept (value application/json)
Copy below code and paste in your Groovy script step in your soapUI testcase.
import java.security.MessageDigest
import javax.crypto.Mac
import javax.crypto.spec.SecretKeySpec
import java.net.URLEncoder
import java.security.InvalidKeyException;
import com.eviware.soapui.support.types.StringToStringMap
//Read all variables from SoapUI properties, you can hardcode constant string too or pass dynamic in someother way
def resType = context.expand( '${cosmosProps#resType}' )
def host = context.expand( '${cosmosProps#CosmosDBHost}' )
def cosmosAPIVersion = context.expand( '${cosmosProps#CosmosDBAPIVersion}' )
def access_key = context.expand( '${cosmosProps#CosmosDBMasterKey}' )
def method = context.expand( '${cosmosProps#method}' )
def resourceId = ""
TimeZone.setDefault(TimeZone.getTimeZone('GMT'))
def String GMTsourceDate = new Date()
//RFC_1123_DATE_TIME conversion
def String GMTdateString = new Date().parse('EEE MMM d HH:mm:ss z yyyy', GMTsourceDate).format("EEE, d MMM yyyy HH:mm:ss z")
log.info "Converted DateTimeString: "+GMTdateString
//Method to HAMCSHA256 - pass decoded key and payload text
static byte[] HmacSHA256(String payloadText, byte[] key) throws Exception {
String algorithm="HmacSHA256"
Mac mac = Mac.getInstance(algorithm);
mac.init(new SecretKeySpec(key, algorithm))
return mac.doFinal(payloadText.getBytes("UTF-8"))
}
log.info "masterKey is "+access_key
//decode above masterkey since its already base64 encoded
byte[] decodedKey = access_key.decodeBase64()
//build PayloadString using verb, resType, resourceID and date, you can pass this dynamic if you want
def String payLoadString = "get"+"\n"+resType+"\n"+resourceId+"\n"+GMTdateString.toLowerCase()+"\n"+""+"\n"
log.info payLoadString
//call HMacSha256 by passing payload and key
def hash256signed = HmacSHA256(payLoadString, decodedKey)
String signature = hash256signed.encodeBase64()
log.info("encoded base64 signed: "+signature)
//building URI
def MasterToken = "master"
def TokenVersion = "1.0"
def headers = new StringToStringMap()
//URL encoding
def String toURLEncode = "type=" + MasterToken + "&ver=" + TokenVersion + "&sig=" + signature
def AuthHdr = java.net.URLEncoder.encode(toURLEncode, "UTF-8")
log.info 'AUTHHDRIS: ' + AuthHdr
//putting all caculated headers to soapui request
headers.put("Authorization", AuthHdr)
headers.put("x-ms-version", cosmosAPIVersion)
headers.put("Accept", "application/json")
headers.put("x-ms-date", GMTdateString)
def testStep = testRunner.testCase.getTestStepByName("CosmosAPIRequest");
testStep.getHttpRequest().setRequestHeaders(headers)
log.info ("DONE")
Sep 25, 2020
బాలుగారి అకాల నిష్క్రమణ..భావ వ్యక్తీకరణకి అతీతO
పాట ఎలా పాడాలి అని చెప్పడానికి చాలా గురువులుండొచ్చు, కాని పాటలు ఎలా వినాలి అని నేను నేర్చుకొన్నది మాత్రం బాలు గారి ఏకలవ్య శిష్యరికంలొనే..తినే అన్నంలో ప్రతీ మెతుకు ఆస్వాదించినట్లు.. వినే పాటలో ప్రతీ స్వరం, అక్షరం ఎలా ఆస్వదించాలొ నేర్చుకున్నాను.ఈ సమయం..మాటలకి అందని భావం..భావ వ్యక్తీకరణకి అతీతం..సంగీతప్రపంచమే శోకసముద్రంలో ఉంది..నాది కేవలం అశృబిందువు మాత్రమే..అతని ఆత్మకి ఖచ్చితంగా శాంతికలుగుతుంది..మనకి అతని శాశ్వతమైన గొంతు శాంతినిస్తుంది..అస్తు..
Jan 23, 2020
ఆంధ్రప్రదేశ్..అగమ్య గోచరం..గందరగోళం..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్తితి చూస్తుంటే ఏం చెప్పాలో అర్ధం కావడం లేదు. రాజకీయ స్వలాభం అనాలా, అహం అనాలా, ఒకరి మీద ఒకరికి కసి అనాలా, మొండితనం అనాలా, ఎత్తులకు పైఎత్తులనాలా, ఏం అనాలో అర్దం కావటం లేదు. జనాలు ఏం అనుకుంటున్నారో ఎవరికీ అవసరం లేదు. ఏమైనా అంటే అఖండ మెజారిటీ ఇచ్చారు అంటున్నారు. ఒకసారి ఎన్నుకుంటే ఇక మీరేమన్నా మాకవసరం లేదని ఏ ప్రజాస్వామ్యం లో చెప్పారో మరి. నిజం చెప్పొద్దూ ప్రతిపక్షం ఏమీ చెయ్యలేక విఫలయత్నాలు చేస్తుంది. ఆ మెజారిటీ కి ఎవ్వరూ ఏమీ చెయ్యలేరనేది నిజం. తాత్కాలికంగా ఆపడం తప్ప. చివరికి ఓడేది ప్రజలే. ఇదిలా ఉంటే..సోషల్ మీడియాలో అత్యుత్సాహం చూపిస్తూ విపరీతంగా కొట్టుకుంటున్నారు మాటలతో..బూతులు మాట్లాడుకుంటున్నారు. ఎందుకంత అత్యుత్సాహం? అలా చేస్తే చంద్రబాబు డబ్బులిస్తాడా? లేక జగన్ ఇస్తాడా? కొంచెం బుర్రతో ఆలోచంచండి. అలా ఇచ్చి మాట్లాడించనవాళ్ళు లేకపోలేదు..కానీ మామూలు పజానీకం కూడా మాట్లాడేస్తున్నారు. కొసమెరుపేంటంటే..ప్రభుత్వానికి, ప్రతిపక్షానికి భక్తులెక్కువయ్యారు.. అవును..ఒక చిన్న విమర్శనని తట్టుకోలేని..అసలు విననేలేని భక్త భృందంమరి..అంటే..విరుచుకు పడిపోతున్నారు..నాకెందుకో మీకు బాగా కలిసివచ్చిందనుకుంటా? ఇది సరైన విధానం అనిపించటంలేదు మరి. విమర్శని స్వాగతించండి. పధ్ధతిగా సమాధానం చెప్పండి.
Apr 6, 2019
వోటరూ..నీ ఆలోచన మారాలి..
కొంతమంది వోటర్లకి పచ్చకామెర్లు, కొంతమంది వోటర్లు పరిపక్వతలేనివాళ్ళు, కొంతమంది బాధ్యత లేనివాళ్ళు..ముందు వీళ్ళు మారాలి. ముందుగా పచ్చకామెర్ల వోటరు గురించి. వీళ్ళు ఎలా ఆలొచిస్తారంటే ఎవరిని చూసిన అదే ద్రుస్టి, ద్రుక్పథం. ***థెరీస ఇప్పుడు వచ్చి సేవచేస్తానన్నా..ఏదో స్వలాభం లేనిదే ఎందుకు చేస్తారు..ఎదో ఉండే ఉంటుంది అని ఆలోచిస్తారు. ఎవడు కొత్తగా వచ్చి ఎన్నికల్లో నిలబడినా ఒకే ప్రశ్న..వీడికి సామజికపరంగ ఎన్ని వోట్లు పడతాయి? ఏ పని చేసినా ఇది ఏ రాజకీయ లబ్దికోసమో? ఇలా..దురద్రుస్టం ఏంటంటే అన్ని వార్తా మాధ్యమాలు కూడా ఇలాగే విశ్లేషిస్తున్నాయి. వీళ్ళకి మార్పు మీద నమ్మకం ఉండదు.ఎందుకంటే అది ఎంటొ వీళ్ళకి తెలిసే అవకాశం లేదు. మార్పు అంటే వీళ్ళు కేవలం వీడు కాకపోతే వాడు..అంతే.. ఇక పరిపక్వత లేనివాళ్ళు - ఇంట్లో చిన్నపిల్లలకి చిరుతిళ్ళకి, భోజనానికి తేడా తెలియనట్టే వీళ్ళకి కూడా అభివ్రుద్ధి కి నిజమైన అర్థం తెలీదు. చిరుతిళ్ళు తింటే కొద్దిసేపటికే మళ్ళీ ఆకలేస్తుంది..అదే భొజనం అలా కాదు. తాత్కాలిక ప్రయోజనాలు ప్రకటించే రెండు ప్రధాన పార్టీలనే వీళ్ళు నమ్ముతారు..రుణ మాఫిలు, నిరుద్యోగ భ్రుతి, పసుపు-కుంకుమ, కులాలకి రిజర్వేషన్లు, ఇలా వగైరా డబ్బులు ముష్టి వేసే పర్టీలకి వీళ్ళ సప్పోర్టు. తాగే నీరు, ప్రభుత్వ పాఠశాలలొ విద్య మెరుగు (సౌకర్యాలు అవసరాలకి తగ్గట్టు, ఇంకా చాలా ఉన్నాయి చెయ్యడానికి.. ఇక్కడ చోటు సరిపోదని క్లుప్తంగ), వైద్య విధానంలో మార్పులు (కొన్ని చిన్నపాటి క్లినిక్లు గ్రామీణ ప్రాంతాలలో, పెద్ద ఆసుపత్రిలో సేవలు మెరుగు..ఇలా), ఇవి చాలా ప్రాధమికమైన అవసరాలు..మనలొ ఎంతమంది ఎంత దబ్బు ఖర్చుపెడుతున్నాం ఇలాంటివాటిపైన? ఈ ఖర్చులు తగ్గాలని లేదా? ఈ కేటగిరి వాళ్ళకి ఇవి అర్థం కావు..వీళ్ళకి ఎంథసేపు..మా వాడు వస్తే నాకు ఇది ఇస్తాడు..ఇది చేస్తాడు..ఏమి చేశదు ఇన్నాల్లు? సరైన ఆలొచన లేనివాడు నీకేమి చెయ్యగలడు..ప్రభుత్వ ఆఫిసులో రికమండేషనా? అసలు రికమండేషనే అవసరం లేని సమాజం కదా కావాలి..అది..అందుకే వీళ్ళని పరిపక్వత లేని వోటరు అన్నది.. తరువాత..బాధ్యత రాహిత్యం..వీళ్ళు పన్ను కట్టనివాళ్ళు..వీళ్ళకి నిజంగ ప్రభుత్వం ఎలా ఉన్నా పెద్ద తేడా లేదు. ఎందుకంటే ప్రజల డబ్బు ఎలా పోతే వీళ్ళకేంటి? అవసరమైతే ఒక చెయ్యేసి తింటారు కూడా. కులగజ్జి, స్వలాభాల జలగలు..ఇవన్ని ఈ కేటెగిరి. నా దృస్టిలో "నిర్వీర్యమైపోయిన ప్రభుత్వనికి పన్ను కట్టడం దురదృస్టకరం". ఇప్పుదు మనం (పన్ను కట్టేవాళ్ళు) చేస్తున్నది అదే..నాదృస్టిలో పన్ను కట్టనివాడికి వోటు హక్కు కూడా ఉండకూడదు..కట్టేవాడు ఎలాగూ బాధ్యతగా ఆలొచిస్తాడు కదా.. మనం ఎదైన మంచిపనికి ఉపయోగించరా అని ఎవడికైన దబ్బులిస్తే అది నిజంగ ఉపయోగపదిందా లేదా అని చూస్తాము కదా? ఇంకెవడికో (అర్హతలేనివాడికి) ఆ డబ్బు ఊరికే దానం చేస్తే మండదా? ఇక మేధావి వర్గం - నిజంగ మేధావి అనుకునేరు..పప్పులో కాలేసినట్టే..బాగా చదువుకున్న మూర్ఖులు..వీడికి వోటేస్తే అంతా వుద్దరిస్తాడా? అసలు చెయ్యగలడా? ఇల అరుగుమీద కుర్చొని మాట్లడతారు..వీల్లు కూడా మార్పుకి స్వాగతించలేరు.. ఈ మధ్య - ఎన్.టి.వి లో ఒక ఇంటర్వ్యు చూశాను..పవన్ కళ్యాణ్ ది..పుష్కరాలకి తగలేసిన 2000 కోట్లు నేనయితే కొన్ని పాఠశాలలైన బాగుచెయ్యడానికి వాడేవాదిని అన్నాడు..పైన చెప్పిన పరిపక్వత కలిగిన ఆలొచనలన్ని మాట్లాడాడు..విద్య గురించి, ఆరొగ్యం గురించి, దళారి వ్యవస్త గురించి మటాడడమేకాదు సమస్యల పరిష్కారాలు కూడా సూచించాడు (ఇవన్ని చెయ్యలేనివి కాదు..మన ప్రభుత్వాలు తలచుకుంటే 30 యేళ్ళలో సాధ్యమయ్యేవే)..లోతైన అవగాహన లేనివాళ్ళకి ఇవి తెలిసే అవకాశమే లేదు..అందరూ మాట్లాడటారు కాని ఎవరూ చెయ్యరు అని కొంతమంది మాట్లాడుతున్నారు..అసలు ఎవరైన ఇన్నాళ్ళ పార్టీలు, ప్రభుత్వాలు ఈ సమస్యలు మాట్లాడారా? సగటు మధ్యతరగతి గురించి ఆలొచించారా? కులం, మతం పరంగ కాదు.."మద్యతరగతి"..అర్థమయ్యిందా? సమాజం ఎప్పుడు బాగుపదుతుందో అని ఎదురుచూసి మార్పు కోరేవాళ్ళలో నేను ఒకడిని..నాకు పవన్ సిద్ధంతాలు..పరిష్కారాలు నచ్చాయి..ఇలాంటివాళ్ళు అసలు సమాజంలో ఆలొచించే అవకాశం కల్పిస్తారు..వీళ్ళకి అవకాశం ఇవ్వాలి..ఇంక మీ ఇష్టం.
Mar 23, 2019
ఎన్నికలు..సోషల్ మీడియా ప్రచారం
వెన్నుపోటు, కేసులు, బి పార్టి లాంటి చౌకబారు ప్రచారాలని మర్చిపోయి ఒకసారి తటస్తంగా ఆలోచించడానికి ప్రయత్నిద్దాం..సేంద్రీయ వ్యవసాయం, రైతు పంటకి సరైన మార్కెటింగ్, కోల్డ్ స్టొరేజిలు, మస్త్యకారులకి జెట్టిలు, మరబోటులు వగైరా, ఇవి కదా నిజమైన సహాయం. అంతేకాని, ప్రతినెల అందరికి డబ్బులు పంచడం వాళ్ళని బిచ్చగాళ్ళని, సోమరులని చెయ్యటమే ఔతుంది..మరి మనం కట్టే పన్నులు ఇలా వృధా అవ్వటం ఎన్నాళ్ళు భరించాలి? రేషన్ లో అవినీతికి తావివ్వటం కన్నా, డబ్బులు నేరుగా మహిళల ఖతాలలో వెయ్యటం మంచి ఆలోచన కాదంటరా? దీనివల్ల వ్యవస్థలో కూరుకుపోయిన అవినీతిని (ఆ విభాగం వరకు అయినా) సమూలంగ నిర్మూలన కాదా? వీటితో పాటు ప్రత్యేక రాస్ట్ర ప్యాకేజి, పారిశ్రామిక విధానం (చిత్తశుద్ధి ఎలాగూ ఉంది), మరి ఇలాంటి దీర్ఘకాలిక ప్రయోజనాలతో మార్పు తెస్తానన్న జనసేన బాగాలేదంటారా? ఆలోచించండి..ప్రభుత్వం ఏర్పాటు చేసే మెజారిటి రాకపోవచ్చు, కాని మార్పుకి తొలిమెట్టైనా ఔతుంది.. సోషల్ మీడియాలో ప్రచారం విఙ్నానవంతంగా, ఆలోచించేదిగా ఉండాలి కాని..తిట్టుకుంటూ ఎన్నాళ్ళు చేస్తారు? దానివల్ల ఉపయోగం ఏంటి?
Oct 21, 2018
రాజకీయాలు..సోషల్ మీడియా
వ్యక్తిగత దూషణలతో ఇటు కుర్రకారే ఊగిపోతుందనుకుంటే అంతకుమించి ప్రతిస్టాత్మక పదవులలో ఉండి కూడా కొంతమంది ఇవే దూషణలు చేస్తూ సమాజానికి చాలా మంచి మెసేజే ఇస్తున్నారు..దానికి అవతలివారు మరీ రెచ్చిపోతున్నారు. ఏ సోషల్ మీడియాని మీరు బలం అనుకుంటున్నారో..అదే సోషల్ మీడియా మీకు బలహీనతగా కూడా మారొచ్చు..అనసరమైన, అసందర్భమైన, అనుచితమైన వ్యాఖ్యలు చాలా ఈమధ్య చక్కర్లు కొడుతున్నాయి..దయచేసి సోషల్ మీడియాలొ అర్థవంతమైన వ్యాఖ్యలు చేయమని మనవి. అధికారంలో మేముండి ఇదిగో ఒక పట్టిసీమ తెచ్హామనండి, లేదా పోలవరం ఉంది అనండి, లేదా ఇంకోటి అనండి ఆలోచిస్తారు జనాలు...ప్రతిపక్షంలో ఉండి మేము ఇలానిలదీసాం అని చెప్పండి..వింటారు జనాలు..అంతేకాని..ఈపార్టి మనిషి ఆ పార్టీ మనిషిని దూషించడనికో లేదా, నువ్వెవడివిరా నన్ను అడగడానికి, నువ్వెంత నీ బతుకెంత..లాంటి వ్యాక్యలు అటు రాజకీయనాయకులు అనటంకాని..అలాగే కుర్రకారు మనకి నచ్చని ప్రతీవాడిని బండ బూతులు తిట్టడం, ఈ మద్య కొత్తగా ట్రోల్ చెయ్యడం తగ్గించుకుంటే మంచిది అని నా అభిప్రాయం. ఆలోచించండి.
Oct 19, 2018
పెళ్ళంటే గొప్ప స్నేహం ఆ స్నేహానికి పునాది నమ్మకం, గౌరవం..బాపూగారి పెళ్ళిపుస్తకం
ఏదైన సినిమా చూడాలంటే కాలక్షేపంకోసం చూస్తామేమో కాని బాపు గారి సినిమా చూస్తే మాత్రం ఏదో అనుభూతి, ఇంకేదో జ్ఞాపకాలకు తెరలేపుతాయి..అప్పుడప్పుడు పాఠాలు కూడా నేర్పుతాయి. పెళ్ళిపుస్తకం చూస్తున్నాను..అందం, అనుమానం, అసూయ, సొగసు, హాస్యం, అనుభవం, జీవిత/దాంపత్య సారం..అన్నీ కలగలిపి తీసినట్టుంది.లౌక్యానికి, బ్రతకేర్చిన తనానికి ఒక అనుమానపు తెర ఎలాంటి అపార్థాలను కలుగచేస్తుందో..ఆ తెర తొలగినప్పుడు ఎలాంటి నమ్మకానికి పునాది ఔతుందో అద్భుతంగా చూపించారు..అగ్ని సాక్షిగా పడిన ముడి..అగ్నిపునీతమైన ప్రేమకి నిదర్శనంగా చూపించారు.. ఆ పుస్తకం లోని ప్రతీ పేజి..ప్రతి దాంపత్య జీవితంలో ఉండే పేజినే.. ఎన్నిసార్లు చూసినా మళ్ళి చూడాలనిపిస్తుంది..ద్రుశ్య కావ్యం అంటే ఇదేనేమో..కథ సారాంశం: పెళ్ళంటే గొప్ప స్నేహం ఆ స్నేహానికి పునాది నమ్మకం, గౌరవం..
Oct 14, 2018
అరవింద సమేత వీరరాఘవ..
అరవింద సమేత వీరరాఘవ..ఇది అని ఏదీ చెప్పలేకుండా బాగానే ఉంది అన్నట్టుంది.పూర్తి నిడివి రాయలసీమ యాసలో సంభాషణలు నన్ను ఆకట్టుకున్నాయి.యుద్ధం తరువాత ఉండే పరిస్థితులని ఫ్యాక్షన్ సబ్జెక్ట్ లో చూపిస్తూ శాంతి నెలకొల్పడం కోసం కథానాయకుడేమి చేశాడు అని చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. నటీనటులు ఎవరి పాత్రకు వారు న్యాయం చేశారు.తమన్ రీ-రికార్డింగ్ సినిమాకి బాగా ఉపయోగపడింది.
Oct 7, 2018
నోటా అని ఒక సినిమా వచ్చింది..
ఏంటో..నిజజీవిత ప్రజాస్వామ్య వ్యవస్థలో, ప్రభుత్వాలలో, భారత దేశ/రాస్ట్ర రాజకీయ వ్యవస్థలో ఎప్పటికీ జరగని మార్పు సినిమాలలోని కలలలోని చూసుకోవడం చాలా బాగుంటుంది కదూ..కొత్తగా నోటా అని ఒక సినిమా వచ్చింది.. చూసి ఒక 2 గం|| కలలోకి వెల్లి రండి..ఎప్పుడైన వ్యవస్తాగత లోపాలు చూసి రక్తపోటు వచ్చేవాల్లకి కొంచెం రిలీఫ్ గా ఉంటుంది.
Aug 25, 2018
విశ్వనాథుడు తపస్వే..కాని..కళా"తపస్వి" మాత్రం "విశ్వనాథుడే"..
విశ్వనాథుడు తపస్వే..కాని..కళా"తపస్వి" మాత్రం "విశ్వనాథుడే"..ఎంత తపించాడో కానీ..శంకరాభరణం లాంటి సినిమాలు తీయగలిగాడు.ప్రతీ అక్షరం..ప్రతీ స్వరం..ప్రతీ సన్నివేశం..చెక్కినట్టుంటుంది..ఎన్నిసార్లు చూసినా ఇలా ఎలా తీసాడో అని ఆశ్చర్యం కలుగుతుంది..అంతర్లీనమయిన భావం అద్భుతం..
Mar 16, 2018
ఎవడ్రా వాడు..దిల్లీవాడు..నాన్సెన్స్..
తెలుగు రాష్ట్రాలకి అన్యాయం చేసిన ఏ పార్టీ బట్టకట్టదు..కట్టనివ్వొద్దు మనం.ఇదే ఆత్మగౌరవం కోసం తెలుగు దేశం, ఇదే అత్మగౌరవనినాదంతొ తెలంగాణా ఆవిర్భవించాయి. అదే నినాదం తొ కాంగ్రెస్ దాదాపు భూస్తాపితం అయ్యింది. ఇంక ఇప్పుడు మీరు. ఏదో పీకుతారని వోటు వేశాం. ఇది నేను చెప్పక్కర్ల..దేశమే చెప్తుంది..ఇటీవల ఎన్నికలే నిదర్శనం..మీరు అధికారం లోకి వచ్చినప్పుడు గుర్తుందా అఖండ మెజారిటి..మరిప్పుడు..చించండి కొంచెం.. ఇంక రాస్ట్రంలో 40 యేళ్ళ అనుభవమున్న సారు..మీరు ఇంకొంచెం స్పీడు పెంచాల సారు..అన్ని పార్టీలని కలుపుకొని కేంద్రం నడుములు విరవండి..ఇంకోసారి దక్షిణం వైపు చూడాలంటే ఎకరం తడవాలి..అంతేకాని విమర్శలు చేసేవాళ్ళమీద ఎగరడం వలన ప్రయోజనం లేదు సారు.. ఇంకోసారున్నారు..వారి గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది..మేము సి.ఎం అయితేనే మాట్లాడతాం..ఒకవేళ మాట్లాడినా మా ప్రయోజనాలు మాకుంటాయి..కేవలం ప్రభుత్వం ఏది చేసిన ఒప్పుకోము..హర్షించము..రాష్ట్రప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఏమి చెయ్యట్లేదు అని మాత్రమే అంటాము..ఇంకేమి అనము..మీకు అంత సుపోర్టు ఉంది కదా.. మీరు ఒక్కసారి తొడగొట్టి దిల్లీ పెద్దల నడుము వంచరాదూ..మీకు సలాం కొడతాం..అప్పుడు మీరు సి.ఎం కూడా అవ్వొచ్చు..ఏమంటారు?మీరేమంటారు..ఒదార్పు యత్ర చేద్దం రండి..అది మీరు బాగా చేస్తారు..మంచి టాక్ ఉంది జనాలలో.. సరే..ఇక్కడితో ఆపుదాం. ఇప్పటికైనా అన్ని రాజకీయ పార్టీలు పార్టీలకి అతీతంగా కలిసి కేంద్రం పై యుద్దం ప్రకటించండి..సి.ఎం తొ సహ రోద్దుమీదకి వచ్చి నిరసన తెలపండి..ప్రజలు అక్కర్ల..ప్రజా ప్రతినిధులు మీరు చాలు..ప్రభుత్వం స్తంభింపచెయ్యండి..ఎవడ్రా వాడు..దిల్లీవాడు..నాన్సెన్స్..మాటతప్పినవాడు ఎవడైతే ఏంటి..నిజాయితీగా ఉంటే..నిజాయితీకి ఒక పొగరు కూడా ఉంటుంది..అది తియ్యండి బయటికి..నిజాయితి లేదంటారా..మీ ఇస్టం..మీరే ఒప్పుకున్నట్టు..
Sep 11, 2016
వెబ్ సైట్ లలో సినిమా "రివ్యూలు"..
వెబ్ సైట్ లలో ప్రతీ వాళ్ళు సినిమా "రివ్యూలు" రాసేస్తున్నారు. నేను మాట్లాడుతున్నది పర్సనల్ వెబ్ సైట్లుగురించి, పర్సనల్ కామెంట్ల గురించి కాదు...సో కాల్డ్ కమెర్షియల్ వెబ్ సైట్లు గురించి.కళ గురించి రాయడానికి కేవలం 'ఎనలిస్ట్' అయితే సరిపోదు, కళాకారుడో, కళను ఇష్టపడినవాడో, మంచి ప్రేక్షకుడో, అయి ఉండాలి. గుండె మీద చెయ్యేసుకొని ఒక్కసారి ఆలొచించండి. పైవాటిలో మీరు ఎదోక కేటగిరిలోకి వస్తే రాయండి. ఇది "కొంతమంది" కమెర్షియల్ టీ.వి సినిమా జర్నలిస్టులకి కూడా వర్తిస్తుంది.
Sep 1, 2016
కేంద్రంలో "స్పెషల్ కదలిక" పవన్ చలవే..
ప్రతిపక్షం అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా అడ్డగోలుగా మాట్లాడడం, ఎదో ఒక రకంగా ఇరుకున పెట్టాలని చూడడం, ప్రజా ప్రయోజనం అనే పేరుతో బందులు చెయ్యటం, బస్సులు తగలబెట్టడం కాదు..ఫ్రభుత్వాన్ని సమర్ధించాల్సిన సమయంలో సమర్ధించాలి..ప్రశ్నించాలి..ప్రభుత్వం చేయలేని పనుల్ని చేయటానికి ప్రయత్నించాలి..అవసరమైతే కేంద్రంతో పోరాడాలి..అంతేగాని..ప్రభుత్వం అది చెయ్యలేకపొయింది, సి.ఎం ఇది చెయ్యలేదు అని మీడియాలో మాట్లడి ఇంట్లొ పడుకోవటం కాదు..ప్రభుత్వనికి బాధ్యత ఎంతుందొ ప్రతిపక్షానికి కూడా అంతే బాధ్యత ఉంది అని తెలుసుకోండి..ఈ విషయంలో పవన్ కల్యానే బెటెర్ అనిపిస్తుంది..ప్రతిపక్షం పాత్ర బాగా పోషించాడు. ఒక్క బహిరంగ సమావేశంతో కేంద్రంలో "కదలిక" తీసుకొచ్చాడు. ఎవరేమన్నా.. ఇది ముమ్మాటికి కరెక్ట్ మూవ్..
Apr 22, 2016
తెలంగాణా..ఆంధ్ర
తెలంగాణా - కొత్త ఆలొచనలు..కొత్త పంధాలు..మరి ఆంధ్ర..కులాల కుమ్ములాటలు..అధికార దాహాలు..అవకాశం కోసం ఎదురుచూపులు..ఆర్థిక సంక్షోభం.
Jan 22, 2016
ఆత్మహత్య వీడియో..తప్పుగా అనుకోకండి..
ఆత్మహత్యలను ఎలాగూ ఆపలేకపోతున్నాం..కనీసం మరణం ముందు "ఆత్మహత్య లేఖ" బదులు "ఆత్మహత్య వీడియో" మీ ఫేస్ బుక్ లో పెట్టండి. అసలు మీరెందుకు చనిపోయారో సమజానికి అర్థం ఔతుంది. లేకపోతే ఎవరికీ అర్థంకాని మిస్టెరి అయిపోతుంది..తప్పుగా అనుకోకండి..లేదా రాజకీయనాయకులు వాడేసుకుంటారు.
Dec 22, 2015
కారణజన్మ..అనొచ్చునేమొ?
ఎందరో సంగీత దర్శకులు, ఎన్నో మధురమైన పాటలు, మరెన్నో వైవిధ్యాలు..మన అందరికి చేర్చే గొంతు మాత్రం ఒకటే..బాలసుబ్రమణ్యం. కారణజన్మ అనొచ్చునేమొ?
Nov 25, 2015
నాకు కూడ ఇది దేశభక్తిగా కనిపించటం లేదు. కొంచెం ఆలోచించడి..
రేసుగుర్రం లో నాకు నచ్చిన ఒక డైలాగ్ - "తప్పు నాది కాదు బాబు, ఈ మీడియా వాళ్ళే తెలుగు-టు-తెలుగు ట్రాన్స్లేషన్ మిస్సండర్స్టాండ్ చేసుకున్నారు..". నాకెందుకో ఈ డైలాగ్ గుర్తొచ్చింది. "నాకు భయం వేస్తుంది, మనమిక ఈ దేశం లో ఉండలేమేమో"? అని ఒకడు అంటే.. నీకెందుకయ్య భయం మేము లేమూ? అనటం హిందూమత తత్వం..ఇదే భరోసా.. ఇందువల్లే పరమత సహనం వర్థిల్లుతొంది..అదే మన దేశ గొప్పతనం. నిజమైన భారతీయుడు కాపాడాల్సింది ఇదే. మరి..నాకు భయమేస్తుంది అని ఒకడు అంటే.."పోతే పో" అంటూ వాడిమీద దాడి చెయ్యటం.?? అందరు కలసి అతను చెప్పినదానిని నిజం చేస్తున్నారు.నాకు కూడ ఇది దేశభక్తిగా కనిపించటం లేదు. కొంచెం ఆలోచించడి..
Aug 7, 2015
శ్రీమంతుడు..డబ్బున్నోడు కాదు..మనసున్నోడు
శ్రీమంతుడు..డబ్బున్నోడు కాదు..మనసున్నోడు అసలైన శ్రీమంతుడు.ఈపాటికే నేను దేనిగురించి మాట్లాడుతున్నానో అర్థమయ్యుంటుంది. లాజికల్గా ఆలోచించి ఏదేదో రాసెయ్యొచ్చు, కాని అలా రాయాలనిపించలేదు. మంచి సినిమా, కుటుంబసమేతంగా చూడొచ్చు.చూడండి..బాహుబలి కన్నా ఈ సినిమా కథ పరంగా బాగుంది. పెద్ద తారాగణంతో వెండితెర నిండుగా ఉంది..ఒక మంచి కలలా, ఇలా జరిగితే..ఎవరైనా చేస్తే బాగుండు అనిపించే సినిమా..ఎవేవో పిచ్చి కంపేరిసన్స్ అనవసరం.
Jul 24, 2015
ఇంక చాలు ఆపండి..అమ్మాయిలూ.. మిమ్మల్నే..
ఇంక చాలు ఆపండి..అమ్మాయిలూ.. మిమ్మల్నే..ఇంక ఆపండి చాలు.భారత దేశం మొత్తం మీద కోటి ఇరవై లక్షల మంది జనాభాలో సుమారు 75 లక్షలమంది మగవాళ్ళుంటే, అందులో ఎంతమంది ఆడపిల్లలతో అసభ్యంగ ప్రవర్తిస్తున్నారు, ఎంతమంది అత్యాచారాలకు పాల్పడుతున్నారు? అయినా అలా చేసేవాళ్ళని మృగాలంటారు..మగాళ్ళనరు.వాళ్ళని, మగజాతిని మీరు ఒకేగాటిన కడుతున్నారు. అలాగే ఇదేదో ఒక్కమనదేశంలోనే జరుగుతున్నట్టు ప్రచారం చేస్తున్నారు. ఇది చాలక బయటిదేశస్తులు కూడా భరతదేశం అంటే ఇవె గుర్తొచ్చేలా చేస్తున్నారు. మృగాలు ఎక్కదైన ఉంటాయి, అవి మృగాలలాగానే ప్రవర్తిస్తాయి. మనమే జాగ్రత్తగా ఉండాలి. అందుకే మన అమ్మానాన్నలు అన్ని జాగ్రత్తలు తీసుకునేవారు/తీసుకుంటారు..చేతిలొ ఒక మొబైల్ ఉంది కదా అని ఒక వీడియో తీసెయ్యటం, ఒక వ్యాసం రాసెయ్యటం, జనాలమీదకి వదిలెయ్యటం..అది జనాలు లైకులు కొట్టటం, షేర్లు చెయ్యటం. స్ట్రీజాతి అంటే గౌరవం ఉంది, అది మన సంస్కృతిలోనే ఉంది. నిదర్శనం కావాలంటే, మీ అన్నల్ని, మీ నాన్నల్ని అడగండి. వంటింట్లో ఉన్నంత మాత్రాన అదేదో చిన్నతనమూ కాదు..మీరేమీ తక్కువైపోరు.అలా అనుకోవటం ఒక ఆత్మన్యూనతాభావం. దానిలోనుండి బయటకువస్తే అప్పుడు మీ గొప్పతనం మీకే అర్థమౌతుంది. ఎవడో ఒక్కడు ఎక్కడో ఎదో చేసాడని జాతిని, సమాజాన్ని, దేశాన్ని నిందించటం మానుకోండి.. ఒకవేళ అలా అనిపిస్తే..మీకు దగ్గరలో ఉన్న మానసిక వైద్యునికి చూపించుకోండి.
Jul 11, 2015
బాహుబలి-ఆరంభం: Baahubali movie
బాహుబలి..ఇప్పుడు తెలుగువాడి నోటివెంట ఎక్కువగా వినిపించుతున్న మాట. ఇప్పటికే చాలామంది చుసేసే ఉంటారు. మరికొందరు చూడడానికి సిద్ధంగా ఉన్నారు. "సినిమా ఎలాఉన్నా ఒక్కసారి చూడాలి.." అనుకుంటున్నవాళ్ళే ఎక్కువమంది ఉన్నారు అంటే అతిశయోక్తి కాదు.. సరే ఇక విషయానికొద్దాం..నేనుకూడా నిన్ననే చుశా. అందులోని కొన్ని విషయాలు మీకోసం.
"బాహుబలి-ఆరంభం" నిజంగానే ఇది కథకి ఆరంభం మాత్రమే. ఈ భాగం ముఖ్యమైన పాత్రలని పరిచయం చెయ్యటానికి మాత్రమే ఉపయోగించుకున్నాడనిపించింది. శివుడి పాత్రని పరిచయం చేసేటప్పుడు, అతను పుట్టుకతోనే ఒక ప్రత్యేకతకలవాడిగాను, పెరిగిన తరువాత శివలింగం పెకలించి మొయ్యగల బలవంతుడిగాను, (పెంచిన) అమ్మకోసం ప్రేమపంచే కొడుకుగాను, మానవమాత్రులకి సాధ్యమా అని అనిపించే పర్వతాన్ని అవలీలగ ఎక్కే ధైర్యం, ఆత్మవిశ్వాసం, పట్టుదల, ఆ రక్తంలోనే ఉందా అన్నట్టు ఆవిష్కరించాడు. శివగామి పాత్ర ఆత్మత్యాగం చేసుకోవడంతో మొదలైనా.. పోనుపోను ప్రాముఖ్యత పెంచాడు..తెలివి, న్యాయదక్షత, నిష్పక్షపాతం, రాజతంత్రం, తిరుగుబాటు అనిచివేత.. మొత్తనికి ఒక పవర్ఫుల్ పాత్ర అని చెప్పొచ్చు. రమ్యకృష్ట్ణ చాలావరకు న్యాయం చేసిందనే చెప్పాలి. అన్నిటికన్న నాకు నచ్చింది "కట్టప్ప" పాత్ర..విశ్వాశానికి మారుపేరుగా, శక్తివంతుడైన సైనికుడిగా బాగా పరిచయం చేశాడు. ఒకమనిషిని ద్వేషిస్తున్నా..కేవలం అతను రాజైన కారణానికి అతనిని కాపాడటం..సిమ్హాసనానికి అతని నిబద్ధత చెప్తుంది.సత్యరాజ్ ఈ పాత్రలో అతికినట్టు సరిపోయారు..చాలా బాగా చేశారు..ఇక బాహుబలి పాత్రనైతే.. కేవలం పేరు చెప్తేనే, బానిసలు, కళాకారులు, సైనికులు, ప్రజలు ఒకరేమిటి అందరి రక్తం లొ నూతనోత్సహం పరిగులెడుతున్నట్టు.. ఒళ్ళుపులకరించే రాజమౌలి మార్కు ఎలివేషన్ తో ఆకట్టుకున్నాడు.అవంతిక ఒక అందమైన యువతిగా, ఆమెని ప్రేమించిన శివుడు కర్తవ్యం వైపు ఎలా మళ్ళించబడ్డాడు అనేది అసలు కథ. ఇక్కడినుండి కథ పరిగెడుతూ విరామం తరువాత ప్రేక్షకులకి కట్టిపడేస్తుంది. భల్లలదేవ పాత్రకున్న బలం, పదవీ వ్యామోహం, కుటిలము కౄరత్వం కలిసున్న పాత్రగా బాగా పండించాడు రానా. బ్యాలెన్సుడుగా చేశాడని చెప్పొచ్చు.ఇంక దేవసేన పాత్ర పూర్తి స్థాయిలో పరిచయం చెయ్యలేదు.కొడుకు తప్పకుండా వస్తాడని నమ్మి బందీగా 25 సం|| వేచిఉండి, అన్ని అవమానాలూ పడే ఒక తల్లి పాత్ర మాత్రమే కనిపించింది. పాటలు కొంచెం న్యూట్రల్ గా అనిపించాయి. దక్షిణ భారత సంగీత వాసనలు లెకుండా జాగ్రత్తలు తీసుకున్నారా అనిపించింది. కాని 1-2 పాటలు రాజమౌలి మార్కు ఎంటెర్తైన్మెంట్ ఉన్నాయి. ఇంక అందరూ ఊహించినట్టే ఎఫెక్ట్లు బాగున్నాయి, మరీ సొషియో ఫేంటసీ సినిమాలా ఎక్కువకాకుండా..తగినట్టు పెట్టుకున్నాడు. యుద్ధ సన్నివేశాలు సినిమాకి హైలైట్స్. "300" నుండి కాలకేయుల పాత్రలు కాపీకొట్టినా, అది తీయటం లోని కష్టం కనపడుతుంది..భళా రాజమౌలి అనొచ్చు. ఒక లాజికల్ కనెక్షన్ తో మొదటిభాగం ముగించాడు.
ఇంకొంచెం సరిచేయాల్సినవి నాకేమనిపించిందంటే: శివగామిని పాత్రకి పొటెన్ష్యాలిటి ఎక్కువ. అది ఇంకా కొంచెం ఎలివేట్ చేస్తే బగుండు అనిపించింది. ఒక పార్టులోనే మొత్తం కథ చెప్పొచ్చు, కాని అన్ని పాత్రలని సరిగ్గ ఎష్టబ్లిష్ చెయ్యలేనేమో అని రాజమౌలి భయపడ్డాడేమో అనిపించింది.
మొత్తానికి తెలుగు సినిమా ఖ్యాతి పెంచిందనే చెప్పొచ్చు. ఒవెరాల్ గ తప్పకుండ చూడాల్సిన సినిమా.
Subscribe to:
Posts (Atom)