ఎందరో సంగీత దర్శకులు, ఎన్నో మధురమైన పాటలు, మరెన్నో వైవిధ్యాలు..మన అందరికి చేర్చే గొంతు మాత్రం ఒకటే..బాలసుబ్రమణ్యం. కారణజన్మ అనొచ్చునేమొ?
Dec 22, 2015
కారణజన్మ..అనొచ్చునేమొ?
ఎందరో సంగీత దర్శకులు, ఎన్నో మధురమైన పాటలు, మరెన్నో వైవిధ్యాలు..మన అందరికి చేర్చే గొంతు మాత్రం ఒకటే..బాలసుబ్రమణ్యం. కారణజన్మ అనొచ్చునేమొ?
Nov 25, 2015
నాకు కూడ ఇది దేశభక్తిగా కనిపించటం లేదు. కొంచెం ఆలోచించడి..
రేసుగుర్రం లో నాకు నచ్చిన ఒక డైలాగ్ - "తప్పు నాది కాదు బాబు, ఈ మీడియా వాళ్ళే తెలుగు-టు-తెలుగు ట్రాన్స్లేషన్ మిస్సండర్స్టాండ్ చేసుకున్నారు..". నాకెందుకో ఈ డైలాగ్ గుర్తొచ్చింది. "నాకు భయం వేస్తుంది, మనమిక ఈ దేశం లో ఉండలేమేమో"? అని ఒకడు అంటే.. నీకెందుకయ్య భయం మేము లేమూ? అనటం హిందూమత తత్వం..ఇదే భరోసా.. ఇందువల్లే పరమత సహనం వర్థిల్లుతొంది..అదే మన దేశ గొప్పతనం. నిజమైన భారతీయుడు కాపాడాల్సింది ఇదే. మరి..నాకు భయమేస్తుంది అని ఒకడు అంటే.."పోతే పో" అంటూ వాడిమీద దాడి చెయ్యటం.?? అందరు కలసి అతను చెప్పినదానిని నిజం చేస్తున్నారు.నాకు కూడ ఇది దేశభక్తిగా కనిపించటం లేదు. కొంచెం ఆలోచించడి..
Aug 7, 2015
శ్రీమంతుడు..డబ్బున్నోడు కాదు..మనసున్నోడు
శ్రీమంతుడు..డబ్బున్నోడు కాదు..మనసున్నోడు అసలైన శ్రీమంతుడు.ఈపాటికే నేను దేనిగురించి మాట్లాడుతున్నానో అర్థమయ్యుంటుంది. లాజికల్గా ఆలోచించి ఏదేదో రాసెయ్యొచ్చు, కాని అలా రాయాలనిపించలేదు. మంచి సినిమా, కుటుంబసమేతంగా చూడొచ్చు.చూడండి..బాహుబలి కన్నా ఈ సినిమా కథ పరంగా బాగుంది. పెద్ద తారాగణంతో వెండితెర నిండుగా ఉంది..ఒక మంచి కలలా, ఇలా జరిగితే..ఎవరైనా చేస్తే బాగుండు అనిపించే సినిమా..ఎవేవో పిచ్చి కంపేరిసన్స్ అనవసరం.
Jul 24, 2015
ఇంక చాలు ఆపండి..అమ్మాయిలూ.. మిమ్మల్నే..
ఇంక చాలు ఆపండి..అమ్మాయిలూ.. మిమ్మల్నే..ఇంక ఆపండి చాలు.భారత దేశం మొత్తం మీద కోటి ఇరవై లక్షల మంది జనాభాలో సుమారు 75 లక్షలమంది మగవాళ్ళుంటే, అందులో ఎంతమంది ఆడపిల్లలతో అసభ్యంగ ప్రవర్తిస్తున్నారు, ఎంతమంది అత్యాచారాలకు పాల్పడుతున్నారు? అయినా అలా చేసేవాళ్ళని మృగాలంటారు..మగాళ్ళనరు.వాళ్ళని, మగజాతిని మీరు ఒకేగాటిన కడుతున్నారు. అలాగే ఇదేదో ఒక్కమనదేశంలోనే జరుగుతున్నట్టు ప్రచారం చేస్తున్నారు. ఇది చాలక బయటిదేశస్తులు కూడా భరతదేశం అంటే ఇవె గుర్తొచ్చేలా చేస్తున్నారు. మృగాలు ఎక్కదైన ఉంటాయి, అవి మృగాలలాగానే ప్రవర్తిస్తాయి. మనమే జాగ్రత్తగా ఉండాలి. అందుకే మన అమ్మానాన్నలు అన్ని జాగ్రత్తలు తీసుకునేవారు/తీసుకుంటారు..చేతిలొ ఒక మొబైల్ ఉంది కదా అని ఒక వీడియో తీసెయ్యటం, ఒక వ్యాసం రాసెయ్యటం, జనాలమీదకి వదిలెయ్యటం..అది జనాలు లైకులు కొట్టటం, షేర్లు చెయ్యటం. స్ట్రీజాతి అంటే గౌరవం ఉంది, అది మన సంస్కృతిలోనే ఉంది. నిదర్శనం కావాలంటే, మీ అన్నల్ని, మీ నాన్నల్ని అడగండి. వంటింట్లో ఉన్నంత మాత్రాన అదేదో చిన్నతనమూ కాదు..మీరేమీ తక్కువైపోరు.అలా అనుకోవటం ఒక ఆత్మన్యూనతాభావం. దానిలోనుండి బయటకువస్తే అప్పుడు మీ గొప్పతనం మీకే అర్థమౌతుంది. ఎవడో ఒక్కడు ఎక్కడో ఎదో చేసాడని జాతిని, సమాజాన్ని, దేశాన్ని నిందించటం మానుకోండి.. ఒకవేళ అలా అనిపిస్తే..మీకు దగ్గరలో ఉన్న మానసిక వైద్యునికి చూపించుకోండి.
Jul 11, 2015
బాహుబలి-ఆరంభం: Baahubali movie
బాహుబలి..ఇప్పుడు తెలుగువాడి నోటివెంట ఎక్కువగా వినిపించుతున్న మాట. ఇప్పటికే చాలామంది చుసేసే ఉంటారు. మరికొందరు చూడడానికి సిద్ధంగా ఉన్నారు. "సినిమా ఎలాఉన్నా ఒక్కసారి చూడాలి.." అనుకుంటున్నవాళ్ళే ఎక్కువమంది ఉన్నారు అంటే అతిశయోక్తి కాదు.. సరే ఇక విషయానికొద్దాం..నేనుకూడా నిన్ననే చుశా. అందులోని కొన్ని విషయాలు మీకోసం.
"బాహుబలి-ఆరంభం" నిజంగానే ఇది కథకి ఆరంభం మాత్రమే. ఈ భాగం ముఖ్యమైన పాత్రలని పరిచయం చెయ్యటానికి మాత్రమే ఉపయోగించుకున్నాడనిపించింది. శివుడి పాత్రని పరిచయం చేసేటప్పుడు, అతను పుట్టుకతోనే ఒక ప్రత్యేకతకలవాడిగాను, పెరిగిన తరువాత శివలింగం పెకలించి మొయ్యగల బలవంతుడిగాను, (పెంచిన) అమ్మకోసం ప్రేమపంచే కొడుకుగాను, మానవమాత్రులకి సాధ్యమా అని అనిపించే పర్వతాన్ని అవలీలగ ఎక్కే ధైర్యం, ఆత్మవిశ్వాసం, పట్టుదల, ఆ రక్తంలోనే ఉందా అన్నట్టు ఆవిష్కరించాడు. శివగామి పాత్ర ఆత్మత్యాగం చేసుకోవడంతో మొదలైనా.. పోనుపోను ప్రాముఖ్యత పెంచాడు..తెలివి, న్యాయదక్షత, నిష్పక్షపాతం, రాజతంత్రం, తిరుగుబాటు అనిచివేత.. మొత్తనికి ఒక పవర్ఫుల్ పాత్ర అని చెప్పొచ్చు. రమ్యకృష్ట్ణ చాలావరకు న్యాయం చేసిందనే చెప్పాలి. అన్నిటికన్న నాకు నచ్చింది "కట్టప్ప" పాత్ర..విశ్వాశానికి మారుపేరుగా, శక్తివంతుడైన సైనికుడిగా బాగా పరిచయం చేశాడు. ఒకమనిషిని ద్వేషిస్తున్నా..కేవలం అతను రాజైన కారణానికి అతనిని కాపాడటం..సిమ్హాసనానికి అతని నిబద్ధత చెప్తుంది.సత్యరాజ్ ఈ పాత్రలో అతికినట్టు సరిపోయారు..చాలా బాగా చేశారు..ఇక బాహుబలి పాత్రనైతే.. కేవలం పేరు చెప్తేనే, బానిసలు, కళాకారులు, సైనికులు, ప్రజలు ఒకరేమిటి అందరి రక్తం లొ నూతనోత్సహం పరిగులెడుతున్నట్టు.. ఒళ్ళుపులకరించే రాజమౌలి మార్కు ఎలివేషన్ తో ఆకట్టుకున్నాడు.అవంతిక ఒక అందమైన యువతిగా, ఆమెని ప్రేమించిన శివుడు కర్తవ్యం వైపు ఎలా మళ్ళించబడ్డాడు అనేది అసలు కథ. ఇక్కడినుండి కథ పరిగెడుతూ విరామం తరువాత ప్రేక్షకులకి కట్టిపడేస్తుంది. భల్లలదేవ పాత్రకున్న బలం, పదవీ వ్యామోహం, కుటిలము కౄరత్వం కలిసున్న పాత్రగా బాగా పండించాడు రానా. బ్యాలెన్సుడుగా చేశాడని చెప్పొచ్చు.ఇంక దేవసేన పాత్ర పూర్తి స్థాయిలో పరిచయం చెయ్యలేదు.కొడుకు తప్పకుండా వస్తాడని నమ్మి బందీగా 25 సం|| వేచిఉండి, అన్ని అవమానాలూ పడే ఒక తల్లి పాత్ర మాత్రమే కనిపించింది. పాటలు కొంచెం న్యూట్రల్ గా అనిపించాయి. దక్షిణ భారత సంగీత వాసనలు లెకుండా జాగ్రత్తలు తీసుకున్నారా అనిపించింది. కాని 1-2 పాటలు రాజమౌలి మార్కు ఎంటెర్తైన్మెంట్ ఉన్నాయి. ఇంక అందరూ ఊహించినట్టే ఎఫెక్ట్లు బాగున్నాయి, మరీ సొషియో ఫేంటసీ సినిమాలా ఎక్కువకాకుండా..తగినట్టు పెట్టుకున్నాడు. యుద్ధ సన్నివేశాలు సినిమాకి హైలైట్స్. "300" నుండి కాలకేయుల పాత్రలు కాపీకొట్టినా, అది తీయటం లోని కష్టం కనపడుతుంది..భళా రాజమౌలి అనొచ్చు. ఒక లాజికల్ కనెక్షన్ తో మొదటిభాగం ముగించాడు.
ఇంకొంచెం సరిచేయాల్సినవి నాకేమనిపించిందంటే: శివగామిని పాత్రకి పొటెన్ష్యాలిటి ఎక్కువ. అది ఇంకా కొంచెం ఎలివేట్ చేస్తే బగుండు అనిపించింది. ఒక పార్టులోనే మొత్తం కథ చెప్పొచ్చు, కాని అన్ని పాత్రలని సరిగ్గ ఎష్టబ్లిష్ చెయ్యలేనేమో అని రాజమౌలి భయపడ్డాడేమో అనిపించింది.
మొత్తానికి తెలుగు సినిమా ఖ్యాతి పెంచిందనే చెప్పొచ్చు. ఒవెరాల్ గ తప్పకుండ చూడాల్సిన సినిమా.
Jan 2, 2015
ఇదే కదా PK లో చెప్పింది..
ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వడి అందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణంబెవ్వడు అనాది మధ్య లయుడెవ్వడు సర్వము తానైన వాడెవ్వడు వాని నాత్మభవు ఈశ్వరునినే శరణంబు వేడెదన్! ఇదే కదా PK లో చెప్పింది..దీనికి పెద్ద రాద్ధాంతమెందుకు..
Subscribe to:
Posts (Atom)