Tabs



May 22, 2014

పోరు ముగిసింది..


పోరు ముగిసింది.తెలుగువాడి ఆత్మగౌరవ పోరులో వోటరు ఎమోషనల్ అయ్యాడు. ఊహించిన ఫలితాలనే ఇచ్చాడు.తెలంగాణలో దొరబాబు, ఆంధ్రలో చంద్రబాబు సి.ఎం ఔతారు. సరె..ఎలాగూ దొరబాబు తెలంగాణని మరో సింగపూర్ చెసేస్తాడు లెండి.పాపం చంద్రబాబే సింగపూర్ చేస్తాడొ లేదొ చూడాలి..ఈసారికి ఎలాగో ఎమోషనల్ గేంస్ లో నాయకులొచ్చేశారు..ఇప్పుడు చెప్పిన వాగ్ధానాలు కాని చెయ్యకపోతే ఈసారి తాటతీస్తారు అని తెలుసుకోండి..సారి మర్చిపోయా మన "దివంగత నేత కుమారుడు" అనూహ్యంగా ఎక్కువ సీట్లు (అనుకున్నదానికన్న) గెలిచాడు. ఆత్మగౌరవం దెబ్బతింటే..దెబ్బ తప్పదు..ఇది గుర్తుంచుకోండి నాయకులారా..ఇది ఎవరికోచెప్పనక్కరలేదు..మీరు ఏమి చేసినా జనాలకి చెప్పి ఒప్పించి చెయ్యండి..

Mar 9, 2014

ఎలిమినేషన్ మెథడ్..voting


రాష్ట్రంలో ఒక పెద్ద అయోమయస్థితి ఉంది ఎవడిని ఎన్నుకోవాలో అని(ఒహ్ సారీ..అంటే అంధ్ర ప్రదేశ్ లో.. తెలంగాణలొ క్లారిటి ఉంది)..నిజమే అన్ని పార్టీలు కలిసి వోటర్లని బాగా కంఫూషన్ స్టేట్ లోకి నెట్టేశాయి..సరే ఈ పరిస్తితులలో ఏమి చెయ్యాలి.. మొట్టమొదట ..విభజన గురించి మర్చిపొండి..ఎవడు మనల్ని బాగ వేపుకుతిన్నాడు 10 సం|| అని ఆలోచించండి..కూరలు, బియ్యం, పచారి, కనక, వస్తు,వాహన, విద్యుత్, రవాణా,పెట్రోలు, వంట గ్యాస్ ధరలు లెక్కకు మించి పెరగడం, వ్యవసాయదారులు మమ్మల్ని పట్టించుకోవటం లేదు..మేము సెలవు తీసుకుంటాం (క్రోప్ హాలిడె) మహాప్రభో అన్నాకుడా వినిపించుకోకపోవటం.. వోక్స్ వాగన్ కుంభకొణం, ఫ్యాబ్ సిటి ఏమయ్యింది..సాఫ్ట్వేర్ ఉద్యొగాల కుదేలు..2జి, 3జి..10జి స్కాంలు..ఆర్ధిక వ్యవస్త కుదేలు..అదుపులోకి రాని ద్రవ్యోల్బణం,దానికి ఎటువంటి చర్యలు తీసుకోకపోవటం, విద్యుత్ లేక చిన్న పరిశ్రమల మూత, ఇది అయిన 8 నెలలకి చేతులు కాలాక ఆకులు పట్టుకోవటం లా కొత్త పరిస్రమలకు పిలుపు(ఫ్లాప్ అయ్యింది లెండి..)..సరయిన రాయితీలు లేక పరిస్రమల రంగం కుదేలు..ఇబ్బడిముబ్బడిగా ఇంజనీరింగు కాలేజీల పెంపు (ఒకేసారి 50కె సీట్ల నుండి 1,30,000),ఉద్యోగాలు లేక యువత కష్టాలు, సెజ్ లు వలన భూ భాగోతం, ఖజానాలో దబ్బులేదురా అన్న వినిపించుకోకుండ..ఫ్రీ..ఫ్రీ..ఫ్రీ..అన్నీ ఫ్రీ.ఎలా ఆదుకుంటారు ఏమి పీకగలరు..చిట్ట చివరిగా ఒక పద్దతి పాడు లేకుండా విభజన..చిన్న పెద్ద, ముసలి ముతక తేడా లేకుండ రోడ్డు ఎక్కితే కనీసం జవాబుదారితనం లేదు..విభజన జరిగినా ఎవరికి అన్యాయం జరగదు అని ఒక హామి అధికారికంగా లేదు..ఇరుప్రాంత ప్రజలకి భరోసా ఇచ్చే ప్రకటనలు లేవు...ప్రజలకి అవగాహన కలిపించే నాధుడు లేడు..ఇది మన భారతం..ఎవడిని నమ్మాలి..ఎన్నికలొచ్చాయి మళ్ళీ అదె బాట..ఫ్రీ..ఫ్రీ..రండి బాబు రండి.. ఇప్పుడు మనకు కావాల్సింది ఫ్రీ కాదు..ఇప్పటికైన కళ్ళుతెరవండి.. ఇంత చేసిన కాంగ్రెస్సు ఇంక భూస్తాపితం చెయ్యండి..ఆటలో అరటిపండులా మళ్ళీ వీల్ల చేతుల్లొ పెట్టకండి..వీళ్ళకి అధిస్టానం మాటే వేదం..సొంత అభిప్రాయాలుండవు..అందుకే సరయిన మెజారిటి వేరే వాళ్ళకి ఇవ్వండి... ఎలిమినేషన్ మెథడ్: నో కాంగ్రెస్స్, దాని పిల్ల పార్టిలు వై.ఎస్.అర్, కిరణ్ కొత్త పార్టి లకి నో, పవన్ కల్యాన్ పార్టి (ఒక వేళ పెడితే) పెద్ద జోక్..ఇక మిగిలింది టి.డి.పి. మరియు లోక్సత్త..లోక్సత్త వస్తే మంచిదే..కాని ఇస్తే ఫుల్ మెజారిటి ఇవ్వండి లేకపోతే టి.డి.పి కి ఇవ్వండి..అంతే కాని అటు ఇటు కాని పార్టీలని ప్రోత్సహించవద్దు..చంద్రబాబు మంచి స్టేట్స్మాన్..అని నా అభిప్రాయం..లేదు నేను ఎవడి మాట వినను అంటే.."వోట్ ఫర్ నన్" అయినా వేసి చావండి...అంతే కాని పనికిమాలిన వెదవలకి అనవసరంగా వెయ్యొద్దు..

Feb 25, 2014

పూర్ణస్య.. పూర్ణమిదం..

పూర్ణస్య పూర్ణమిదం..సున్నలో నుండి సున్న తీసేస్తే సున్నయే మిగుల్తుంది..అని అర్థం చేసుకుంటే అందులో అర్థం లేదు..పూర్ణం అంటే అందులో సంపూర్ణం, అనంతం అని అర్థం ఉంది అని తెలుసుకుంటే...దాని అర్థమే అనంతం..అదే భారతీయతలోని గొప్పతనం...నేటి యువత పూర్ణం అంటే "సున్న" అనుకుంటుంది...

పైసా..సినిమా..చూడండి..

"పైసా" మంచి సినిమా.బాగుంది..3.5/5 విచిత్రంగా సినిమా మొత్తం కృష్ట్ణవంశి కన్నా "నాని"యే కనిపించాడు. కెథరిన్ చాల బాగా చేసింది, తన పాత్ర లొ "వంశి" శైలి బాగా కనిపించింది. కొత్త మ్యూసిక్ డైరెక్టెర్ అయినా బ్యాగ్రౌండ్ బాగా ఇచ్చాడు. అంతర్లీనంగా ఈ సమాజం లొ మనం డబ్బు వెనకాల ఎల పడుతున్నమో చెప్పాడు. ఈసీమనీ కోసం ఎంతకైన తెగించేవాళ్ళు ఎక్కువయ్యారని.. వీధి రౌడీలకి కూడా కోట్లు సంపాదించాలనే ఆశ..దాన్ని వాడుకుంటున్న రాజకీయ నాయకులు..కోట్ల హవాలా కుంభకోణాలు..ఆఖరికి ప్రాణం కన్నా డబ్బుకి ఇచ్చే విలువలు...కొసమెరుపు 2 రాజకీయనాయకుల క్యారక్టెర్స్...ఒకడు కోస్తాలో మద్యం దుకాణాల కాంట్రాక్టెర్..రాష్ట్రానికి పెద్దదిక్కైపోదామనుకుని ఊర్లో రౌడీలని ఎలా వాడుతున్నాడో చూపిస్తే ఇంకొకడు ఎలగైనా సి.ఎం అయిపోవాలి అని వాళ్ళ ఊరి రౌడీలకి డబ్బు వెదజల్లి వాల్ల తరతరాలకి దేవుడైపొయే క్యారక్టెర్..క్లూ ఎంటంటే కదప నాటు బాంబులు..ఈ రాజకీయ నయవంచకులు ఎవరై వుంటారు చెప్మా? హ హ హ..

Jan 27, 2014

సినిమా ఒక మాధ్యమం..

సినిమా ఒక మాధ్యమం..అది ఏ ఎమోషన్ అయినా చెప్పొఛ్చు..చైతన్యం, అశ్లీలం, రౌద్రం, అవసరం, సమాజం, థ్రిల్, కుటుంబం, విలువలు, భయం...ఒక్కొక్క దర్శకుడు తన వ్యూస్ ని వ్యక్తీకరిస్తాడు..ఒక్కో ఎమోషన్ కి ఒక్కో ప్రేక్షకుడుంటాడు..కొన్ని సినిమాలు వినోదాన్ని పంచితే కొన్ని సినిమాలు ఆలోచింపచేస్తాయి..కొన్ని సినిమాలు బాధ్యత చెప్పితే కొన్ని సినిమాలు రాహిత్యాన్ని చెప్తాయి..ఏదైనా ఎమోషనే..

Apr 23, 2013

మిథునం...

"తనకొపమె తన శత్రువు తన శాంతమె తనకు రక్ష...నిజమే పద్యమేమొ వచ్చేసింది..తత్వమే వంటబట్టి చ్హావటంలేదు.."
"దాంపత్యము.. దప్పళము మరిగిన కొద్దీ రుచి.."
"వాడివంతు ఆకులు చెల్లాయనుకో..మిగిలేదేముంది నేలే.."
మరి..దాంపత్య గొడవలు అందంగా ఉంటాయా?అందంగా చూస్తే అలాగే ఉంటాయి మరి..ప్రతి ప్రాణిలో, చెట్టులో, పనిలో శివుడూ... ఒక లేగ దూడ పోతే.. ప్రేక్షకుడితో కన్నీరు పెట్టించటమే దానికి తార్కాణం..
"వర్షం వల్ల అన్నం పుడుతుంది.....అన్నం సర్వప్రపంచానికి ముఖ్యమైనది కదా..అందుకే..అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్న మాట..మొదటి ముద్ద స్ఫటిక లింగం..దానికి నెయ్యితో అభిషేకం,ఆవకాయతో బొట్టు..కొత్తిమీర దండ..పప్పు నైవేద్యం..పెరుగుతో శుద్ధి చేసి ఆత్మలింగం లో కలుపుకుంట.. " ఇది శివ తత్వం కాక మరెంటి? మరి పుష్ప విలాపం?అడుగడుగునా శివతత్వమే..శివోహం..శివోహం..అప్పలరాజూ..నీ అటాచ్చెడ్ డెటాచ్చ్మెంట్ కాన్సెప్ట్ అద్భుతహ..అసలు నీ కరక్టెరే అద్భుతహ.."మిధునం" అంటే దంపతులు...ఇది కథ కాదు..ఎంత చెప్పినా తక్కువే..ఇంక చివరగా..
"abhi na jao chodkar..ke dil abhi bhara nahi..." ఔనట్టు క్లైమాక్స్ ఇంకో అద్భుతహ..

Feb 15, 2013

రాముడి లాంటి భర్త కావాలనుకునే అమ్మాయిలు సీతలా ఉండటానికి ప్రయత్నించండి..