Tabs



Sep 30, 2011

ఓటరూ! అతిగా ప్రకటించిన పథకాలు మన ప్రగతికి అడ్డంకులు..

పథకాల మీద పథకాలు ఇస్తున్నమని డబ్బాకొట్టుకునే రాష్ట్ర ప్రభుత్వం, చివరికి అందరికీ ఉపయోగపడే వంట గ్యాస్ కి, ఎక్కువ మందికి ఉపయోగపడే పెట్రోల్ కి సబ్సిడి ఇవ్వటానికి బుడ్జెట్ లేదు. అంటే..వెనకపడిన తరగతిని అడ్డు పెట్టుకొని,నాయకుల జేబు నింపుకొని, ప్రజలకు కష్టం వచ్చినప్పుడు మొఖం చాటేస్తున్నారు. ఇది ఒక ఉదాహరణ మత్రమే! ఇప్పటికైన అర్థం అయ్యిందా ఓటరూ! అతిగా ప్రకటించిన పథకాలు మన ప్రగతికి అడ్డంకులు..ఇప్పటికీ వాళ్ళనే సమర్థిస్తే ఇది వాళ్ళ విఙతకే వదిలేస్తున్నా!

ఇక తెలంగాణా విషయానికి వస్తే..
"వదలమంటే పాముకి కోపం, వదలొద్దంటే కప్పకి కోపం" చందాన ఉంది కేంద్రం పరిస్థితి. ఈ సంక్షోభానికి తొందరలో తెరపడకపోతే రాష్త్రం మరింత అంధకారం లోకి వెళ్తుంది. ఇప్పటికే అవినీతి, ద్రవ్యోల్బణం, ధరలు పెరుగుదల లాంటి పెద్ద సమస్యలు ముందున్నాయి.

తత్వం?

తత్వాన్ని అర్థం చేసుకోవాలంటే అనుభవం, జ్ఞానం అవసరం. అందుకే కొన్నిసార్లు.. కొన్ని మనకు సిల్లీగా అనిపించొచ్చు..జ్ఞానం/అనుభవం పెరిగినప్పుడు ఆ తత్వం అర్థం ఔతుంది.

తెలుగు..

నైజాం పాలనలో అణచివేయబడ్డ తెలుగు భాషా రూపమే 'తెలంగాణా' భాష. వచ్చిండన్నా, వచ్చాడన్నా వరాల "తెలుగు" ఒకటేనన్నా. తెలుగు భాషా రూపం వేరు, తెలంగాణా వాదం వేరు. రెంటికీ ముడిపెట్టి ఆడుతున్న రాజకీయ "మర్మం" వేరు.

'మీడియా' అనాలా?

చాలా రోజులతరువాత ఈరోజు టి.వి9 పెట్టాను. ఊరెళ్తున్నాను కదా, ఏ బస్సో రైలో మధ్యలో ఆపేస్తారేమో అని..మొదటి వార్త నేను విన్నది..

"రాంగోపాల్ వర్మ విజయవాడలో శాంతిహోమం చేస్తున్నాడంట, అది క్షుద్ర శక్తులను శాంతి చెయ్యటానికేనా?" అని ఒక ప్రశ్న వదిలాడు, తరువాత దానిమీద ఒక ప్రోగ్రాం.. హోమాలు, పొద్దున్న అదీ వేదబ్రాహ్మల చేత చేయించేవి క్షుద్ర పూజలా? ఎవరు చెప్పారు ఆ న్యూస్ ఎడిటర్ కి? అంతా వాళ్ళ ఇష్టమేనా? ఏం.. ఎవరి ఇంట్లొనైనా అవసరమైనప్పుడు శాంతి హోమాలు చెయ్యరా? అయినా ఇది పూర్తిగా 'రాం' వ్యక్తిగత విషయం. ఎవరి నమ్మకాలు వారివి. దేశం తగలబడుతుంటే అలాంటి న్యూస్ కవర్ చెయ్యకుండా, వీధిలో కుక్కల గురించి.. సినిమా వాల్ల వ్యక్తిగత జీవితాల గురించి..వార్తగా చెప్పే వీళ్ళని 'మీడియా' అనాలా?