Tabs



Nov 20, 2021

Connecting Azure CosmosDB from SoapUI Opensource using Groovy script

I had made an attempt to connect azure cosmos DB from Soapui Groovy script. this helps building tests on soapui. 1. Create a project in soapUI --> testsuite --> add a testcase. 2. Create a REST requst using the cosmosDB endpoint https://hostname:port/resType 3. Add a properties step and create few variables as mentioned below just to pass on the input data or you can hardcode inside the code. 4. add a groovy script step and paste below code 5. Create Headers with names - Authorization (value will be filled by below code), x-ms-version (value find latest version date on google eg.2018-12-31), x-ms-date (will be filled by below code, Accept (value application/json) Copy below code and paste in your Groovy script step in your soapUI testcase. import java.security.MessageDigest import javax.crypto.Mac import javax.crypto.spec.SecretKeySpec import java.net.URLEncoder import java.security.InvalidKeyException; import com.eviware.soapui.support.types.StringToStringMap //Read all variables from SoapUI properties, you can hardcode constant string too or pass dynamic in someother way def resType = context.expand( '${cosmosProps#resType}' ) def host = context.expand( '${cosmosProps#CosmosDBHost}' ) def cosmosAPIVersion = context.expand( '${cosmosProps#CosmosDBAPIVersion}' ) def access_key = context.expand( '${cosmosProps#CosmosDBMasterKey}' ) def method = context.expand( '${cosmosProps#method}' ) def resourceId = "" TimeZone.setDefault(TimeZone.getTimeZone('GMT')) def String GMTsourceDate = new Date() //RFC_1123_DATE_TIME conversion def String GMTdateString = new Date().parse('EEE MMM d HH:mm:ss z yyyy', GMTsourceDate).format("EEE, d MMM yyyy HH:mm:ss z") log.info "Converted DateTimeString: "+GMTdateString //Method to HAMCSHA256 - pass decoded key and payload text static byte[] HmacSHA256(String payloadText, byte[] key) throws Exception { String algorithm="HmacSHA256" Mac mac = Mac.getInstance(algorithm); mac.init(new SecretKeySpec(key, algorithm)) return mac.doFinal(payloadText.getBytes("UTF-8")) } log.info "masterKey is "+access_key //decode above masterkey since its already base64 encoded byte[] decodedKey = access_key.decodeBase64() //build PayloadString using verb, resType, resourceID and date, you can pass this dynamic if you want def String payLoadString = "get"+"\n"+resType+"\n"+resourceId+"\n"+GMTdateString.toLowerCase()+"\n"+""+"\n" log.info payLoadString //call HMacSha256 by passing payload and key def hash256signed = HmacSHA256(payLoadString, decodedKey) String signature = hash256signed.encodeBase64() log.info("encoded base64 signed: "+signature) //building URI def MasterToken = "master" def TokenVersion = "1.0" def headers = new StringToStringMap() //URL encoding def String toURLEncode = "type=" + MasterToken + "&ver=" + TokenVersion + "&sig=" + signature def AuthHdr = java.net.URLEncoder.encode(toURLEncode, "UTF-8") log.info 'AUTHHDRIS: ' + AuthHdr //putting all caculated headers to soapui request headers.put("Authorization", AuthHdr) headers.put("x-ms-version", cosmosAPIVersion) headers.put("Accept", "application/json") headers.put("x-ms-date", GMTdateString) def testStep = testRunner.testCase.getTestStepByName("CosmosAPIRequest"); testStep.getHttpRequest().setRequestHeaders(headers) log.info ("DONE")

Sep 25, 2020

బాలుగారి అకాల నిష్క్రమణ..భావ వ్యక్తీకరణకి అతీతO

పాట ఎలా పాడాలి అని చెప్పడానికి చాలా గురువులుండొచ్చు, కాని పాటలు ఎలా వినాలి అని నేను నేర్చుకొన్నది మాత్రం బాలు గారి ఏకలవ్య శిష్యరికంలొనే..తినే అన్నంలో ప్రతీ మెతుకు ఆస్వాదించినట్లు.. వినే పాటలో ప్రతీ స్వరం, అక్షరం ఎలా ఆస్వదించాలొ నేర్చుకున్నాను.ఈ సమయం..మాటలకి అందని భావం..భావ వ్యక్తీకరణకి అతీతం..సంగీతప్రపంచమే శోకసముద్రంలో ఉంది..నాది కేవలం అశృబిందువు మాత్రమే..అతని ఆత్మకి ఖచ్చితంగా శాంతికలుగుతుంది..మనకి అతని శాశ్వతమైన గొంతు శాంతినిస్తుంది..అస్తు..

Jan 23, 2020

ఆంధ్రప్రదేశ్..అగమ్య గోచరం..గందరగోళం..


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్తితి చూస్తుంటే ఏం చెప్పాలో అర్ధం కావడం లేదు. రాజకీయ స్వలాభం అనాలా, అహం అనాలా, ఒకరి మీద ఒకరికి కసి అనాలా, మొండితనం అనాలా, ఎత్తులకు పైఎత్తులనాలా, ఏం అనాలో అర్దం కావటం లేదు. జనాలు ఏం అనుకుంటున్నారో ఎవరికీ అవసరం లేదు. ఏమైనా అంటే అఖండ మెజారిటీ ఇచ్చారు అంటున్నారు. ఒకసారి ఎన్నుకుంటే ఇక మీరేమన్నా మాకవసరం లేదని ఏ ప్రజాస్వామ్యం లో చెప్పారో మరి. నిజం చెప్పొద్దూ ప్రతిపక్షం ఏమీ చెయ్యలేక విఫలయత్నాలు చేస్తుంది. ఆ మెజారిటీ కి ఎవ్వరూ ఏమీ చెయ్యలేరనేది నిజం. తాత్కాలికంగా ఆపడం తప్ప. చివరికి ఓడేది ప్రజలే. ఇదిలా ఉంటే..సోషల్ మీడియాలో అత్యుత్సాహం చూపిస్తూ విపరీతంగా కొట్టుకుంటున్నారు మాటలతో..బూతులు మాట్లాడుకుంటున్నారు. ఎందుకంత అత్యుత్సాహం? అలా చేస్తే చంద్రబాబు డబ్బులిస్తాడా? లేక జగన్ ఇస్తాడా? కొంచెం బుర్రతో ఆలోచంచండి. అలా ఇచ్చి మాట్లాడించనవాళ్ళు లేకపోలేదు..కానీ మామూలు పజానీకం కూడా మాట్లాడేస్తున్నారు. కొసమెరుపేంటంటే..ప్రభుత్వానికి, ప్రతిపక్షానికి భక్తులెక్కువయ్యారు.. అవును..ఒక చిన్న విమర్శనని తట్టుకోలేని..అసలు విననేలేని భక్త భృందంమరి..అంటే..విరుచుకు పడిపోతున్నారు..నాకెందుకో మీకు బాగా కలిసివచ్చిందనుకుంటా? ఇది సరైన విధానం అనిపించటంలేదు మరి. విమర్శని స్వాగతించండి. పధ్ధతిగా సమాధానం చెప్పండి.

Apr 6, 2019

వోటరూ..నీ ఆలోచన మారాలి..


కొంతమంది వోటర్లకి పచ్చకామెర్లు, కొంతమంది వోటర్లు పరిపక్వతలేనివాళ్ళు, కొంతమంది బాధ్యత లేనివాళ్ళు..ముందు వీళ్ళు మారాలి. ముందుగా పచ్చకామెర్ల వోటరు గురించి. వీళ్ళు ఎలా ఆలొచిస్తారంటే ఎవరిని చూసిన అదే ద్రుస్టి, ద్రుక్పథం. ***థెరీస ఇప్పుడు వచ్చి సేవచేస్తానన్నా..ఏదో స్వలాభం లేనిదే ఎందుకు చేస్తారు..ఎదో ఉండే ఉంటుంది అని ఆలోచిస్తారు. ఎవడు కొత్తగా వచ్చి ఎన్నికల్లో నిలబడినా ఒకే ప్రశ్న..వీడికి సామజికపరంగ ఎన్ని వోట్లు పడతాయి? ఏ పని చేసినా ఇది ఏ రాజకీయ లబ్దికోసమో? ఇలా..దురద్రుస్టం ఏంటంటే అన్ని వార్తా మాధ్యమాలు కూడా ఇలాగే విశ్లేషిస్తున్నాయి. వీళ్ళకి మార్పు మీద నమ్మకం ఉండదు.ఎందుకంటే అది ఎంటొ వీళ్ళకి తెలిసే అవకాశం లేదు. మార్పు అంటే వీళ్ళు కేవలం వీడు కాకపోతే వాడు..అంతే.. ఇక పరిపక్వత లేనివాళ్ళు - ఇంట్లో చిన్నపిల్లలకి చిరుతిళ్ళకి, భోజనానికి తేడా తెలియనట్టే వీళ్ళకి కూడా అభివ్రుద్ధి కి నిజమైన అర్థం తెలీదు. చిరుతిళ్ళు తింటే కొద్దిసేపటికే మళ్ళీ ఆకలేస్తుంది..అదే భొజనం అలా కాదు. తాత్కాలిక ప్రయోజనాలు ప్రకటించే రెండు ప్రధాన పార్టీలనే వీళ్ళు నమ్ముతారు..రుణ మాఫిలు, నిరుద్యోగ భ్రుతి, పసుపు-కుంకుమ, కులాలకి రిజర్వేషన్లు, ఇలా వగైరా డబ్బులు ముష్టి వేసే పర్టీలకి వీళ్ళ సప్పోర్టు. తాగే నీరు, ప్రభుత్వ పాఠశాలలొ విద్య మెరుగు (సౌకర్యాలు అవసరాలకి తగ్గట్టు, ఇంకా చాలా ఉన్నాయి చెయ్యడానికి.. ఇక్కడ చోటు సరిపోదని క్లుప్తంగ), వైద్య విధానంలో మార్పులు (కొన్ని చిన్నపాటి క్లినిక్లు గ్రామీణ ప్రాంతాలలో, పెద్ద ఆసుపత్రిలో సేవలు మెరుగు..ఇలా), ఇవి చాలా ప్రాధమికమైన అవసరాలు..మనలొ ఎంతమంది ఎంత దబ్బు ఖర్చుపెడుతున్నాం ఇలాంటివాటిపైన? ఈ ఖర్చులు తగ్గాలని లేదా? ఈ కేటగిరి వాళ్ళకి ఇవి అర్థం కావు..వీళ్ళకి ఎంథసేపు..మా వాడు వస్తే నాకు ఇది ఇస్తాడు..ఇది చేస్తాడు..ఏమి చేశదు ఇన్నాల్లు? సరైన ఆలొచన లేనివాడు నీకేమి చెయ్యగలడు..ప్రభుత్వ ఆఫిసులో రికమండేషనా? అసలు రికమండేషనే అవసరం లేని సమాజం కదా కావాలి..అది..అందుకే వీళ్ళని పరిపక్వత లేని వోటరు అన్నది.. తరువాత..బాధ్యత రాహిత్యం..వీళ్ళు పన్ను కట్టనివాళ్ళు..వీళ్ళకి నిజంగ ప్రభుత్వం ఎలా ఉన్నా పెద్ద తేడా లేదు. ఎందుకంటే ప్రజల డబ్బు ఎలా పోతే వీళ్ళకేంటి? అవసరమైతే ఒక చెయ్యేసి తింటారు కూడా. కులగజ్జి, స్వలాభాల జలగలు..ఇవన్ని ఈ కేటెగిరి. నా దృస్టిలో "నిర్వీర్యమైపోయిన ప్రభుత్వనికి పన్ను కట్టడం దురదృస్టకరం". ఇప్పుదు మనం (పన్ను కట్టేవాళ్ళు) చేస్తున్నది అదే..నాదృస్టిలో పన్ను కట్టనివాడికి వోటు హక్కు కూడా ఉండకూడదు..కట్టేవాడు ఎలాగూ బాధ్యతగా ఆలొచిస్తాడు కదా.. మనం ఎదైన మంచిపనికి ఉపయోగించరా అని ఎవడికైన దబ్బులిస్తే అది నిజంగ ఉపయోగపదిందా లేదా అని చూస్తాము కదా? ఇంకెవడికో (అర్హతలేనివాడికి) ఆ డబ్బు ఊరికే దానం చేస్తే మండదా? ఇక మేధావి వర్గం - నిజంగ మేధావి అనుకునేరు..పప్పులో కాలేసినట్టే..బాగా చదువుకున్న మూర్ఖులు..వీడికి వోటేస్తే అంతా వుద్దరిస్తాడా? అసలు చెయ్యగలడా? ఇల అరుగుమీద కుర్చొని మాట్లడతారు..వీల్లు కూడా మార్పుకి స్వాగతించలేరు.. ఈ మధ్య - ఎన్.టి.వి లో ఒక ఇంటర్వ్యు చూశాను..పవన్ కళ్యాణ్ ది..పుష్కరాలకి తగలేసిన 2000 కోట్లు నేనయితే కొన్ని పాఠశాలలైన బాగుచెయ్యడానికి వాడేవాదిని అన్నాడు..పైన చెప్పిన పరిపక్వత కలిగిన ఆలొచనలన్ని మాట్లాడాడు..విద్య గురించి, ఆరొగ్యం గురించి, దళారి వ్యవస్త గురించి మటాడడమేకాదు సమస్యల పరిష్కారాలు కూడా సూచించాడు (ఇవన్ని చెయ్యలేనివి కాదు..మన ప్రభుత్వాలు తలచుకుంటే 30 యేళ్ళలో సాధ్యమయ్యేవే)..లోతైన అవగాహన లేనివాళ్ళకి ఇవి తెలిసే అవకాశమే లేదు..అందరూ మాట్లాడటారు కాని ఎవరూ చెయ్యరు అని కొంతమంది మాట్లాడుతున్నారు..అసలు ఎవరైన ఇన్నాళ్ళ పార్టీలు, ప్రభుత్వాలు ఈ సమస్యలు మాట్లాడారా? సగటు మధ్యతరగతి గురించి ఆలొచించారా? కులం, మతం పరంగ కాదు.."మద్యతరగతి"..అర్థమయ్యిందా? సమాజం ఎప్పుడు బాగుపదుతుందో అని ఎదురుచూసి మార్పు కోరేవాళ్ళలో నేను ఒకడిని..నాకు పవన్ సిద్ధంతాలు..పరిష్కారాలు నచ్చాయి..ఇలాంటివాళ్ళు అసలు సమాజంలో ఆలొచించే అవకాశం కల్పిస్తారు..వీళ్ళకి అవకాశం ఇవ్వాలి..ఇంక మీ ఇష్టం.

Mar 23, 2019

ఎన్నికలు..సోషల్ మీడియా ప్రచారం


వెన్నుపోటు, కేసులు, బి పార్టి లాంటి చౌకబారు ప్రచారాలని మర్చిపోయి ఒకసారి తటస్తంగా ఆలోచించడానికి ప్రయత్నిద్దాం..సేంద్రీయ వ్యవసాయం, రైతు పంటకి సరైన మార్కెటింగ్, కోల్డ్ స్టొరేజిలు, మస్త్యకారులకి జెట్టిలు, మరబోటులు వగైరా, ఇవి కదా నిజమైన సహాయం. అంతేకాని, ప్రతినెల అందరికి డబ్బులు పంచడం వాళ్ళని బిచ్చగాళ్ళని, సోమరులని చెయ్యటమే ఔతుంది..మరి మనం కట్టే పన్నులు ఇలా వృధా అవ్వటం ఎన్నాళ్ళు భరించాలి? రేషన్ లో అవినీతికి తావివ్వటం కన్నా, డబ్బులు నేరుగా మహిళల ఖతాలలో వెయ్యటం మంచి ఆలోచన కాదంటరా? దీనివల్ల వ్యవస్థలో కూరుకుపోయిన అవినీతిని (ఆ విభాగం వరకు అయినా) సమూలంగ నిర్మూలన కాదా? వీటితో పాటు ప్రత్యేక రాస్ట్ర ప్యాకేజి, పారిశ్రామిక విధానం (చిత్తశుద్ధి ఎలాగూ ఉంది), మరి ఇలాంటి దీర్ఘకాలిక ప్రయోజనాలతో మార్పు తెస్తానన్న జనసేన బాగాలేదంటారా? ఆలోచించండి..ప్రభుత్వం ఏర్పాటు చేసే మెజారిటి రాకపోవచ్చు, కాని మార్పుకి తొలిమెట్టైనా ఔతుంది.. సోషల్ మీడియాలో ప్రచారం విఙ్నానవంతంగా, ఆలోచించేదిగా ఉండాలి కాని..తిట్టుకుంటూ ఎన్నాళ్ళు చేస్తారు? దానివల్ల ఉపయోగం ఏంటి?

Oct 21, 2018

రాజకీయాలు..సోషల్ మీడియా

వ్యక్తిగత దూషణలతో ఇటు కుర్రకారే ఊగిపోతుందనుకుంటే అంతకుమించి ప్రతిస్టాత్మక పదవులలో ఉండి కూడా కొంతమంది ఇవే దూషణలు చేస్తూ సమాజానికి చాలా మంచి మెసేజే ఇస్తున్నారు..దానికి అవతలివారు మరీ రెచ్చిపోతున్నారు. ఏ సోషల్ మీడియాని మీరు బలం అనుకుంటున్నారో..అదే సోషల్ మీడియా మీకు బలహీనతగా కూడా మారొచ్చు..అనసరమైన, అసందర్భమైన, అనుచితమైన వ్యాఖ్యలు చాలా ఈమధ్య చక్కర్లు కొడుతున్నాయి..దయచేసి సోషల్ మీడియాలొ అర్థవంతమైన వ్యాఖ్యలు చేయమని మనవి. అధికారంలో మేముండి ఇదిగో ఒక పట్టిసీమ తెచ్హామనండి, లేదా పోలవరం ఉంది అనండి, లేదా ఇంకోటి అనండి ఆలోచిస్తారు జనాలు...ప్రతిపక్షంలో ఉండి మేము ఇలానిలదీసాం అని చెప్పండి..వింటారు జనాలు..అంతేకాని..ఈపార్టి మనిషి ఆ పార్టీ మనిషిని దూషించడనికో లేదా, నువ్వెవడివిరా నన్ను అడగడానికి, నువ్వెంత నీ బతుకెంత..లాంటి వ్యాక్యలు అటు రాజకీయనాయకులు అనటంకాని..అలాగే కుర్రకారు మనకి నచ్చని ప్రతీవాడిని బండ బూతులు తిట్టడం, ఈ మద్య కొత్తగా ట్రోల్ చెయ్యడం తగ్గించుకుంటే మంచిది అని నా అభిప్రాయం. ఆలోచించండి.

Oct 19, 2018

పెళ్ళంటే గొప్ప స్నేహం ఆ స్నేహానికి పునాది నమ్మకం, గౌరవం..బాపూగారి పెళ్ళిపుస్తకం

ఏదైన సినిమా చూడాలంటే కాలక్షేపంకోసం చూస్తామేమో కాని బాపు గారి సినిమా చూస్తే మాత్రం ఏదో అనుభూతి, ఇంకేదో జ్ఞాపకాలకు తెరలేపుతాయి..అప్పుడప్పుడు పాఠాలు కూడా నేర్పుతాయి. పెళ్ళిపుస్తకం చూస్తున్నాను..అందం, అనుమానం, అసూయ, సొగసు, హాస్యం, అనుభవం, జీవిత/దాంపత్య సారం..అన్నీ కలగలిపి తీసినట్టుంది.లౌక్యానికి, బ్రతకేర్చిన తనానికి ఒక అనుమానపు తెర ఎలాంటి అపార్థాలను కలుగచేస్తుందో..ఆ తెర తొలగినప్పుడు ఎలాంటి నమ్మకానికి పునాది ఔతుందో అద్భుతంగా చూపించారు..అగ్ని సాక్షిగా పడిన ముడి..అగ్నిపునీతమైన ప్రేమకి నిదర్శనంగా చూపించారు.. ఆ పుస్తకం లోని ప్రతీ పేజి..ప్రతి దాంపత్య జీవితంలో ఉండే పేజినే.. ఎన్నిసార్లు చూసినా మళ్ళి చూడాలనిపిస్తుంది..ద్రుశ్య కావ్యం అంటే ఇదేనేమో..కథ సారాంశం: పెళ్ళంటే గొప్ప స్నేహం ఆ స్నేహానికి పునాది నమ్మకం, గౌరవం..