Tabs



Jul 11, 2015

బాహుబలి-ఆరంభం: Baahubali movie

బాహుబలి..ఇప్పుడు తెలుగువాడి నోటివెంట ఎక్కువగా వినిపించుతున్న మాట. ఇప్పటికే చాలామంది చుసేసే ఉంటారు. మరికొందరు చూడడానికి సిద్ధంగా ఉన్నారు. "సినిమా ఎలాఉన్నా ఒక్కసారి చూడాలి.." అనుకుంటున్నవాళ్ళే ఎక్కువమంది ఉన్నారు అంటే అతిశయోక్తి కాదు.. సరే ఇక విషయానికొద్దాం..నేనుకూడా నిన్ననే చుశా. అందులోని కొన్ని విషయాలు మీకోసం. "బాహుబలి-ఆరంభం" నిజంగానే ఇది కథకి ఆరంభం మాత్రమే. ఈ భాగం ముఖ్యమైన పాత్రలని పరిచయం చెయ్యటానికి మాత్రమే ఉపయోగించుకున్నాడనిపించింది. శివుడి పాత్రని పరిచయం చేసేటప్పుడు, అతను పుట్టుకతోనే ఒక ప్రత్యేకతకలవాడిగాను, పెరిగిన తరువాత శివలింగం పెకలించి మొయ్యగల బలవంతుడిగాను, (పెంచిన) అమ్మకోసం ప్రేమపంచే కొడుకుగాను, మానవమాత్రులకి సాధ్యమా అని అనిపించే పర్వతాన్ని అవలీలగ ఎక్కే ధైర్యం, ఆత్మవిశ్వాసం, పట్టుదల, ఆ రక్తంలోనే ఉందా అన్నట్టు ఆవిష్కరించాడు. శివగామి పాత్ర ఆత్మత్యాగం చేసుకోవడంతో మొదలైనా.. పోనుపోను ప్రాముఖ్యత పెంచాడు..తెలివి, న్యాయదక్షత, నిష్పక్షపాతం, రాజతంత్రం, తిరుగుబాటు అనిచివేత.. మొత్తనికి ఒక పవర్ఫుల్ పాత్ర అని చెప్పొచ్చు. రమ్యకృష్ట్ణ చాలావరకు న్యాయం చేసిందనే చెప్పాలి. అన్నిటికన్న నాకు నచ్చింది "కట్టప్ప" పాత్ర..విశ్వాశానికి మారుపేరుగా, శక్తివంతుడైన సైనికుడిగా బాగా పరిచయం చేశాడు. ఒకమనిషిని ద్వేషిస్తున్నా..కేవలం అతను రాజైన కారణానికి అతనిని కాపాడటం..సిమ్హాసనానికి అతని నిబద్ధత చెప్తుంది.సత్యరాజ్ ఈ పాత్రలో అతికినట్టు సరిపోయారు..చాలా బాగా చేశారు..ఇక బాహుబలి పాత్రనైతే.. కేవలం పేరు చెప్తేనే, బానిసలు, కళాకారులు, సైనికులు, ప్రజలు ఒకరేమిటి అందరి రక్తం లొ నూతనోత్సహం పరిగులెడుతున్నట్టు.. ఒళ్ళుపులకరించే రాజమౌలి మార్కు ఎలివేషన్ తో ఆకట్టుకున్నాడు.అవంతిక ఒక అందమైన యువతిగా, ఆమెని ప్రేమించిన శివుడు కర్తవ్యం వైపు ఎలా మళ్ళించబడ్డాడు అనేది అసలు కథ. ఇక్కడినుండి కథ పరిగెడుతూ విరామం తరువాత ప్రేక్షకులకి కట్టిపడేస్తుంది. భల్లలదేవ పాత్రకున్న బలం, పదవీ వ్యామోహం, కుటిలము కౄరత్వం కలిసున్న పాత్రగా బాగా పండించాడు రానా. బ్యాలెన్సుడుగా చేశాడని చెప్పొచ్చు.ఇంక దేవసేన పాత్ర పూర్తి స్థాయిలో పరిచయం చెయ్యలేదు.కొడుకు తప్పకుండా వస్తాడని నమ్మి బందీగా 25 సం|| వేచిఉండి, అన్ని అవమానాలూ పడే ఒక తల్లి పాత్ర మాత్రమే కనిపించింది. పాటలు కొంచెం న్యూట్రల్ గా అనిపించాయి. దక్షిణ భారత సంగీత వాసనలు లెకుండా జాగ్రత్తలు తీసుకున్నారా అనిపించింది. కాని 1-2 పాటలు రాజమౌలి మార్కు ఎంటెర్తైన్మెంట్ ఉన్నాయి. ఇంక అందరూ ఊహించినట్టే ఎఫెక్ట్లు బాగున్నాయి, మరీ సొషియో ఫేంటసీ సినిమాలా ఎక్కువకాకుండా..తగినట్టు పెట్టుకున్నాడు. యుద్ధ సన్నివేశాలు సినిమాకి హైలైట్స్. "300" నుండి కాలకేయుల పాత్రలు కాపీకొట్టినా, అది తీయటం లోని కష్టం కనపడుతుంది..భళా రాజమౌలి అనొచ్చు. ఒక లాజికల్ కనెక్షన్ తో మొదటిభాగం ముగించాడు. ఇంకొంచెం సరిచేయాల్సినవి నాకేమనిపించిందంటే: శివగామిని పాత్రకి పొటెన్ష్యాలిటి ఎక్కువ. అది ఇంకా కొంచెం ఎలివేట్ చేస్తే బగుండు అనిపించింది. ఒక పార్టులోనే మొత్తం కథ చెప్పొచ్చు, కాని అన్ని పాత్రలని సరిగ్గ ఎష్టబ్లిష్ చెయ్యలేనేమో అని రాజమౌలి భయపడ్డాడేమో అనిపించింది. మొత్తానికి తెలుగు సినిమా ఖ్యాతి పెంచిందనే చెప్పొచ్చు. ఒవెరాల్ గ తప్పకుండ చూడాల్సిన సినిమా.

4 comments:

  1. Yudham scene aa matram undali valla kastaniki prathiphalam adi..one year kastapadi teesthe 30 minutes kurchoni chudalekapothunnaru janalu.. Rangam loki digaka bhayamenduku ss ki, nijanga bhayapdinte eematram kuda chusundevallam kadu.. Yepudo atakekkundedi movie.. Anyhow your review is good..I liked it..liked the movie very much

    ReplyDelete
  2. Yuddham scenes 30 nimishalu choodalekapotunnaru ante adi janala tappu kaadu.. bore kottakunda director jagarta padaledani ardham... cinema chusetappudu 1 year kastapaddadu ani jaali padutuu cinema chudaalaa? Anta tym money waste chesi kooda janalanu satisfy cheyalenanduku
    badha padali..

    ReplyDelete
  3. Yuddham scenes 30 nimishalu choodalekapotunnaru ante adi janala tappu kaadu.. bore kottakunda director jagarta padaledani ardham... cinema chusetappudu 1 year kastapaddadu ani jaali padutuu cinema chudaalaa? Anta tym money waste chesi kooda janalanu satisfy cheyalenanduku
    badha padali..

    ReplyDelete